Crocodile: మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఏకైక శాఖాహార మొసలి ఉందంటే అది బబియా. ఈ పేరు ఆ మొసలికి ఎవరు పెట్టారో.. ఎప్పుడు పెట్టారో ఎవ్వరికీ తెలియదు. కానీ బబియా అని పిలవగానే చంటి పిల్లాడిలా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏ ఒక్కనాడైనా ఎవరికైనా హాని తలపెట్టింది లేదు. కానీ అకస్మాత్తుగా విగత జీవిగా కనిపించి అందరి చేత కంటతడి పెట్టించింది. ఇంతకీ ఈ మొసలి ఎక్కడ ఉంటుందంటారా? అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఉంటుంది. స్వామివారికి.. ఈ మొసలికి చాలా మంచి అనుబంధం ఉంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. స్వామివారి గర్భగుడిలోనే ఎక్కువగా జీవించేది.
పూజారి పెట్టే భోజనం తప్ప మరేది ముట్టదు. ఇక్కడికి వచ్చిన భక్తులు ‘బబియా’ను చూడందే వెళ్లేవారు కాదు. బబియాకు బెల్లం అన్నం అంటే చాలా ఇష్టమట. దీనికోసం రోజూ కేజీ బియ్యంతో అన్నం వండించేవారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆలయ పూజారి బబియా అని పిలవగానే వచ్చి ఆయన చేతిలోని ఆహారం ముద్దను అందుకుంటుందట. 75 ఏళ్లుగా బబియా స్వామివారి కొలనులో నివాసముంటున్నప్పటికీ అక్కడి మనుషులకే కాదు.. కొలనులోని చేపలు, ఇతర ఏ జీవులకు కూడా కూడా ఏనాడు బబియా హాని తలపెట్టింది లేదట. అందుకే భక్తులకు బబియా అంటే ఎనలేని ప్రేమ.
అనంత పద్మనాభ స్వామివారి సంపద నేలమాళిగల్లో పెద్ద ఎత్తున ఉన్న విషయం తెలిసిందే. ఈ సంపదకు బబియానే కాపలా అని భక్తుల విశ్వాసం. బబియా ఉందనే భయంతోనే అటు వైపు కూడా ఎవరూ చూసేవారు కాదట. అసలు బబియా ఆ కొలనులోకి రావడమే పెద్ద మిస్టరీ అని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందున్న ముసలిని 1945 ఒక బ్రిటీష్ సైనికుడు హత మార్చాడని ఆ తరువాత కొన్ని రోజులకే ఈ మొసలి ఆ కొలనులో కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. మొసలి పార్థీవదేహాన్ని భక్తుల సందర్శనార్థం ఆలయ పరిసరాల్లో ఉంచారు. అనంతరం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
Babiya, the god's own crocodile of Sri Anantapura Lake temple has reached Vishnu Padam.
The divine crocodile lived in the temple's lake for over 70years by eating the rice & jaggery prasadam of Sri Ananthapadmanabha Swamy & guarded the temple.
May she attain Sadgati, Om Shanti! pic.twitter.com/UCLoSNDiyE
— Shobha Karandlaje (@ShobhaBJP) October 10, 2022
Devotees turn up to pay their last respects to Babiya.
For over seven decades at Ananthapura Lake Temple, Babiya was the cynosure of all eyes.
PS: The second photo was inadvertently attributed to Babiya in the previous tweet.@LostTemple7 https://t.co/FbBUhGVgsN pic.twitter.com/iGtwL7PJ4K
— Shobha Karandlaje (@ShobhaBJP) October 10, 2022