Keerthy Suresh : తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో తనదైన శైలిలో నటిస్తూ అందంతో , అభినయంతో మెప్పిస్తున్న తార కీర్తి సురేష్. సాంప్రదాయ చీరకట్టుతో, పట్టు పరికినీలతో, పంజాబీ సూట్స్‌లో కనిపించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో వచ్చిన మహానటి చిత్రంతో అమ్మడి ఛరిష్మా పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా ఈ భామకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది. మహానటి సావిత్ర పాత్రలో ఒదిగిపోయి సినిమాలో ఆమె కట్టు బొట్టుతో కనిపించి అందరి మనసులో అభిమానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బిజియెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది కీర్తి.

Keerthy Suresh : స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తూ తన కెరీర్‌లో దూసుకుపోతోంది కీర్తీ సురేష్. అంతా బాగానే ఉంది కానీ ఈ మధ్య కీర్తి సురేష్ తన అందాలతో దాడి చేయడం మొదలు పెట్టింది. తాజాగ పూసలతో డిజైన్ చేసిన స్టైలిష్ అవుట్‌ఫిట్ ధరించి తన అందాల ప్రదర్శనతో యూత్‌కు పిచ్చెక్కిస్తోంది.

సౌత్ లో సినిమాలతో బిజీగా ఉండటమే కాదు ఫ్యాషన్ ఫోటో షూట్‌లకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది కీర్తి సురేష్ . లేటెస్ట్ ఫోటో షూట్ కోసం కీర్తి సురేష్ పూసలతో డిజైన్ చేసిన గౌన్‌ను వేసుకుని కుర్రాళ్ల మనసును చెదరగొట్టేసింది. టైట్‌ఫిట్‌తో వచ్చిన ఈ బాడీకాన్ డ్రెస్‌లో గ్లామర్ డోస్ పెంచి హాట్ లుక్స్‌తో అందరి చూపును తనవైపు తిప్పుకుంది.

వైట్ కలర్ పూసలతో డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్ కీర్తి సురేష్ ఫిగర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. బ్యాక్‌లెస్, థై హై స్లిట్‌తో వచ్చిన ఈ అవుటఫిట్‌లో ట్రెండీ లుక్స్‌తో కేకపెట్టిస్తోంది కీర్తీ సురేష్. పూసలతో చేసిన వివిధ అలంకరణలు అవుట్‌ఫిట్‌కు ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చాయి. ఈ బాడీకాన్ డ్రెస్‌లో భామ అందాలు రెట్టింపయ్యాయి. యూత్‌కు నిద్ర లేకుండా చేశాయి.

ఫిల్మ్‌మేకర్ సురేష్ కుమార్, నటి మేనకల ముద్దుల కూతురు కీర్తి సురేష్. తమిళ ఆరిజిన్‌కు చెందిన కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. నటిగా తన కెరీర్‌ను ప్రారంభించక ముందే కీర్తి డిజైనర్‌గా సీరియస్‌గా తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంది. అవే ఛాయలు ఇప్పుడు కీర్తి లుక్స్‌లో కనిపిస్తున్నాయి. డిజైనర్ కాలేకపోయినా కీర్తి ప్రస్తుతం డిజైనర్ అవుట్‌ఫిట్స్‌ను ధరిస్తూ ఫ్యాషన్‌పైన తనకున్న మక్కువను చూపిస్తోంది. ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇస్తోంది.

నాన్న ప్రోత్సాహంతో మలయాళంలో గీతాంజలి చిత్రంతో తెరంగేట్రం చేసింది. తెలుగులో మొదటిసారిగా రామ్ సరసన నేను శైలజ సినిమాలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. నేను లోకల్, అగ్నాతవాసి, మహానటి, మన్మథుడు 2 , మిస్ ఇండియా, రంగ్ దే, గుడ్ లక్ సఖీ, సర్కారు వారి పాటి ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగు , తమిళంలో వివిధ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ .

