Krithi shetty: సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలో ఊహించని పాపులాటి సంపాదించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారిలో హీరోయిన్ కృతి శెట్టి కూడా ఒకరు. ఒక్క సినిమాతో ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది కృతి శెట్టి. టాలీవుడ్ హీరో వైష్ణవ తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకు వచ్చింది.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందంతో కుర్రాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇకపోతే ఉప్పెన సినిమాతో ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది అంటే ఇక ఈమెకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో కూడా నటించే అవకాశాలను దక్కించుకుంటోంది. ఇకపోతే ఈమె ఉప్పెన సినిమా తరువాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఉప్పెన సినిమా తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఆమెకు అనుకున్న స్థాయిలో అవి గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి. ఇకపోతే ప్రస్తుతం ఉప్పెన బ్యూటీ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.
ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు చేస్తూ యువతకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తనను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెంచుకుంటోంది. ఇక ఈ మధ్యకాలంలో ఈమె అందాల ఆరబోత ను కూడా ప్రదర్శిస్తోంది.
పద్ధతిగా చీర కట్టులో కనిపిస్తూనే తన అందాలతో సెగలు పుట్టిస్తోంది. తాజాగా కృతి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె పింక్ కలర్ సారీ ను ధరించి తన అందంతో యువతకి చెమటలు పట్టిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.