Ola : దీపావళి సందర్భంగా ఓలా అదిరిపోయే దివాళీ గిఫ్ట్‌తో రంగంలోకి దిగింది. తన వినియోగదారుల కోసం మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఎలక్ట్రిక్ వాహనాలు ఇటీవలి కాలంలో ఊహించని రీతిలో పేలిపోతున్నాయి. అయితే ఈ క్రమంలో కాస్త తమ బడ్జెట్లో మంచి ఓలా బైక్‌ల కోసం జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. పైగా పెట్రోల్ రేటు ఆకాశాన్నంటుతుండటంతో దానికి ఏకైక మందు ఎలక్ట్రిక్ బైకే కావడంతో బైక్ కొనుగోలుదారుల చూపులన్నీ ఎలక్ట్రిక్ వైపే ఉన్నాయి. ఓలా విషయానికి వస్తే.. ఫెయిల్యూర్ చాలా తక్కువ.
కాబట్టి ఓలా బైక్స్‌కు బాగా డిమాండ్ ఉంది. పైగా ప్రస్తుతం ఓలా కంపెనీ అందరికీ అందుబాటు ధరలో బైక్‌ను లాంచ్ చేసింది. రూ.80 వేల లోపు ధరకే ఈ కొత్త వేరియంట్ స్కూటర్‌ను అందుబాటులోకి తేనుందని సమాచారం. ఓలా ఎస్1 పేరుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ సీఈఓ భావిష్ అగర్వాల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. అక్టోబర్ 22న కంపెనీ దీపావళి ఈవెంట్ జరగ బోతోందని.. తమ బంపర్ ఆఫర్లలో ఓలా ఎస్ 1 కూడా ఒకటని భావిష్ అగర్వాల్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక టీజర్ కూడా వదిలారు.
అయితే ఆగస్ట్ 15 ఈవెంట్లో దీనికి సంబంధించి ఓలా ఒక ప్రామిస్ కూడా చేసింది. దీనికి తగినట్టుగానే.. కంపెనీ MoveOS 3ని Ola S1కి రోల్‌అవుట్‌గా ప్రకటించే అవకాశం ఉందని అంచనా. భారత్ మార్కెట్లో అయితే ప్రస్తుతం ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.99,999లకు లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అయితే ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఈ-స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చాలా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్య స్థానాలకు చేర్చుతుండటంతో వినియోగదారులు సైతం ఓలా బైక్స్‌నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.