Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఐదవ వారం కూడా పూర్తై పోయింది. నిన్న ఐదవ కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్లిపోయాడు. చలాకీ చంటి ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. చలాకీ చంటి బిగ్‌బాస్‌కి వస్తున్నాడు అనగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ చంటి హౌస్‌లోకి వెళ్లి చేసిందేమీ లేదు. స్మోకింగ్ హౌస్‌లోకి వెళ్లి సిగిరెట్స్ మీద సిగిరెట్స్ ఊదేయడం.. ఆపై వాళ్ల మీద వీళ్ల మీద చాడీలు చెప్పుకోవడం.. తప్ప చేసిందేమీ లేదు. కనీసం ఎంటర్‌టైన్‌మెంట్ జోలికే వెళ్లింది లేదు.
పోనీ టాస్క్‌లేమైనా ఆడాడా? అదీ లేదు. నామినేషన్స్‌లో ఆర్గ్యుమెంట్ ఏమైనా చేశాడా? అంటే అదీ లేదు. దీంతో చంటి బిగ్‌బాస్ హస్‌లో ఉన్నాడా? లేడా? అనే విషయమే తెలియలేదు. దీంతో అంతా ఓట్లు వేయడమే మరిచారు. నిన్న హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఇక ఈ సమయంలో బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన హైడ్రామా చూడాలి.. బిగ్‌బాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డా ఫిక్స్ అనేది తీసేసి.. హైడ్రామాకు అడ్డా ఫిక్స్ అని పెడితే కరెక్ట్‌గా సెట్ అవుతుందేమో అనిపించింది.
ఫైనల్‌గా ఇనయ, చంటి మిగిలారు. నాగ్ చంటి ఎలిమినేట్ అనగానే ఇనయ ఓ రేంజ్‌లో ఏడుపుకు లంకించుకుంది. తానే వెళ్లిపోతానంటూ హైడ్రామా మొదలు పెట్టింది. ఇంతటితో సూర్య ఆగాడా? తను ఎవరితో బాండింగ్ ఏర్పాటు చేసుకుంటే.. వాళ్లు వెళ్లిపోతున్నారని చెబుతూ ఓ రేంజ్‌లో ఏడ్చేశాడు. కాసేపటికి లాండ్రీ రూమ్‌లోకి వెళ్లిన సూర్య గోడలను పిడికిలితో గుద్దేస్తూ తెగ ఫీలై పోయాడు. వెంటనే ఇనయ కూడా అక్కడకు వెళ్లిపోయింది. అతన్ని గట్టిగా హగ్ చేసుకుని మరీ ఓదార్పు యాత్ర మొదలు పెట్టింది. వీరిద్దరినీ చూసిన వారికి నిజంగా బాధపడుతున్నారా? ఓవరాక్షనా? అనేది అర్ధం కాలేదు.