Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మీడియాపై ఫైర్ అయ్యారు. చివరిలో ప్రశంసలు సైతం కురిపించారనుకోండి.. అది వేరే విషయం ముందైతే మీడియాకు చురకలేశారు. మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’ దసరా పండుగ సందర్భంగా విడుదలై మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో సినిమా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి సహా చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది. ఈ సక్సెస్ మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ మీడియాపై ఫైర్ అయ్యారు.
ఒక సినిమాను ఎప్పుడు ప్రమోట్ చేయాలి? ఏ సినిమాను ఎక్కడ హైప్ చేయాలి? అనే విషయాలు దర్శకనిర్మాతలకు తెలుసని.. తమ పని కూడా మీడియానే చేస్తానంటే ఎలా అంటూ మండిపడ్డారు. తామేం చేయాలో కూడా మీడియానే నిర్ణయిస్తే ఎలా అని ప్రశ్నించారు. గాడ్ ఫాదర్ మూవీని ఒరిజినల్ అయిన లూసిఫర్ కంటే కూడా బాగా రూపొందించామని.. దీంతో తమ టీం అంతా సినిమాపై చాలా నమ్మకంతో ఉందని వెల్లడించారు. ఆ సమయంలో మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు తమకు చాలా చిరాకు తెప్పించాయన్నారు.
సినిమాను సరిగా ప్రమోట్ చేయడం లేదని.. హైప్ లేదని వార్తలు రాశారని మెగాస్టార్ వాపోయారు. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ అంశాన్ని సైతం ప్రస్తావించారు. ఆ రోజున తాను మాట్లాడి ఉండకపోతే.. దానిని వక్రీకరించి వార్తలు రాసి కంపు కంపు చేస్తుందనే భయంతోనే ఆ రోజున తాను వర్షంలో తడుస్తూ కూడా స్పీచ్ ఇచ్చానని వెల్లడించారు. అయితే అదే మీడియా సినిమా రిలీజ్ తర్వాత బాగుందని.. మంచి టాక్ వస్తోందని అద్భుతంగా వార్తలు రాసి తమను ఎంకరేజ్ చేసిదని చెప్పుకొచ్చారు. ఫైనల్‌గా ప్రతి ఒక్కరూ ఈ చిత్రం గురించి మాట్లాడుకునేలా మీడియానే చేసిందని కాబట్టి మీడియాకు మెగాస్టార్ కృతజ్ఞతలు తెలిపారు.