Sarvadhaaman Banarji: గాడ్ ఫాదర్ సినిమా మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార, సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్రలలో నటించిన సూపర్ పొలిటికల్ యాక్షన్ సినిమా ఇది. ఈ సినిమా టాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ రీమేక్. ఈ సినిమాను మోహన్ రాజా తనదైన స్టైల్ లో తెలుగులో రీమేక్ చేశాడు.
ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే . బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తూ గాడ్ ఫాదర్ దూసుకుపోతోంది.నయనతార, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసి దుమ్ము లేపాడు అని టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాలో కీలకమైన పీకేఆర్ పాత్రలో సీఎంగా, చిరంజీవి తండ్రిగా సర్వధామన్ బెనర్జీ నటించారు.
బెనర్జీ 90 దశకంలో దూరదర్శన్ లో ప్రసారం అయిన శ్రీకృష్ణ సీరియల్ లో కృష్ణుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఆలాగే ఈయన మెగాస్టార్ నటించిన స్వయం కృషి సినిమాలో కూడా నటించారు.బుల్లితెర శ్రీకృష్ణుడిగా నటించిన ఆయన మెగాస్టార్ ను చూసి కృష్ణుడు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సర్వధామన్ బెనర్జీ మాట్లాడుతూ, నా డియర్ బ్రదర్ చిరంజీవి గారు ఈ సినిమాలో చిన్న పాత్ర చేయాలని నన్ను పిలిచారు.
నేను పోషించిన పాత్ర చిన్నదే అయిన అందులో ఉండే కథనం, ట్విస్టులు, పాత్రలో వేరియేషన్స్ అద్భుతంగా ఉన్నాయి అని చెప్పారు.ఇక సినిమాకి చిరంజీవి గారి నటన ఒక బలం. నేను మలయాళం వర్షన్ చూశాను. చిరంజీవి గారు చాలా డిఫెరెంట్ గా నటించారు. చిరంజీవి గారి పాత్రలో నాకు శ్రీకృష్ణుడు కనిపించారు. ఎక్కువ డైలాగ్స్ లేకుండా కేవలం ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తోనే అద్భుతంగా నటించారు.
Sarvadhaaman Banarji: గాడ్ ఫాదర్ సినిమా అభిమానులకు హైదరాబాద్ బిర్యానీ..
మలయాళీ చిత్రం అద్భుతమైన వెజిటేరియన్ వంటకం అయితే, గడ్ ఫాదర్ చిత్రం అద్భుతమైన హైదెరాబాదీ బిర్యానీ అని అన్నారు. మారి అంత అద్భుతంగా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి సర్వధామన్ బెనర్జీ అభినందనలు తెలిపారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో దర్శకుడు మోహన్ రాజా, సత్యదేవ్, దివి, సునీల్, మురళి మోహన్ తదితరులు పాల్గొన్నారు.