Lahari Shari: తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ, నటి లహరి షారీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ నటిగా మాత్రమే కాకుండా మోడల్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా యాంకర్ గా కూడా పలు షోలకు వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది లహరి షారీ.
టెలివిజన్ రంగంలో నైట్ డ్రైవ్, సెలబ్రేషన్స్, వైన్ డైన్, యంగ్ అచీవర్స్ లాంటి షోలో హోస్ట్‌గా, యాంకర్‌గా వ్యవహరించి యాంకర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత లహరి 2017లో అయినా మల్లీరావా సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
ఆ తర్వాత అర్జున్ రెడ్డి, పటేల్ సార్, పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి, పేపర్ బాయ్, శ్రీనివాస కళ్యాణం, తిప్పర మీసం లాంటి సినిమాలలో నటించి నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఇటీవలే జాంబిరెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ ద్వారా విపరితమైన పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.
అయితే బిగ్ బాస్ హౌస్ లో ఈమె ఆటలు స్కిట్లు ఎంటర్టైన్ ఎందుకంటే తన అందంతోనే బాగా పాపులాయిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లో కూడా అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదే రీతిలో అందాలను ఆరబోస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అయ్యింది.
ఇక ఈమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె చీరకట్టులో తన అందాలతో మైమరపిస్తోంది. రోజ్ కలర్ శారీని ధరించిన ఆ ముద్దుగుమ్మ ఎంతో పద్ధతి గానే కనిపిస్తూ తన అందంతో ఆకట్టుకుంటుంది..