Amyra Dastur : ఫ్యాషన్‌కు సరైన నిర్వచనం బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్. ఏ అవుట్‌ఫిట్‌లో కనిపించినా చాలా ఆర్టిస్టిక్‌గా ఉంటుందని ఫ్యాషన్ ప్రియులు అంటుంటారు. అమైరా దస్తూర్ ఆన్ స్క్రీన్ లో ఎప్పుడు కనిపించినా అమేజింక్ స్టైల్స్‌తో అందరిని మెప్పిస్తుంటుంది. ఈ విషయంలో అమైరా ఎప్పుడూ విఫలం కాలేదు. రోజు రోజుకు ఆమె ఫ్యాషన్ సెన్స్ పెరుగుతూనే ఉంది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్స్‌ను బట్టి ఆమె ఫ్యాషన్ బార్ ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఫ్యాషన్ ఔత్సాహకులు ఫ్యాషన్ నోట్స్ తీసుకోవడానికి అమైరా ఇన్‌స్టాగ్రామ్ ఓ ఇన్‌స్పిరేషన్ అని చెప్పాల్సిందే.

Amyra Dastur : అమైరా సినిమాల్లో బిజీగా ఉంటూనే వీలుదొరికినప్పుడల్లా ఫ్యాషన్ ఫోటో సెషెన్స్‌తో తన గ్లామరస్ లుక్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా అమైరా పోస్ట్ చేసిన ట్రెడిషనల్ అవుట్‌ఫిట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వెడ్డింగ్, ఫెస్టివ్ ఫ్యాషన్ ఫోటో షూట్ కోసం అద్భుతమైన ఫ్లోరల్ లెహెంగా సెట్ ను ఎన్నుకుంది అమైరా. ఈ లెహెంగాతో చేసిన హాట్ పిక్స్‌ను వరుసగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల కింద గ్లామర్ ఇస్ షైన్ అండ్ కాన్ఫిడెన్స్ అనే క్యాప్షన్‌ను జోడించింది.
డిజైనర్లు పులామి, హర్ష క్లాతింగ్ లేబుల్ నుంచి ఈ అద్భుతమైన లెహెంగా కలెక్షన్‌ను ఎన్నుకుంది అమైరా దస్తూర్. ఫ్లోరల్ ప్రింట్స్‌తో హెవీ ఎంబ్రాయిడరీ హైలెట్స్‌తో వచ్చిన స్కర్ట్ ను వేసుకుని దానికి జోడీగా చేతితో ఎంబ్రాయిడరీ చేసిన టిక్కీ స్కాలోప్డ్ బ్లౌజ్‌ను ధరించింది. భారీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అలంకరణలతో వచ్చిన నెట్ దుపట్టాను భుజం మీద వేసుకుని గ్లామరస్ లుక్స్‌తో యూత్‌ను కవ్వించింది అమైరా.

అమైరా దస్తూర్ మినరాలి స్టోర్ నుంచి కలర్‌ఫుల్ రాళ్లతో పొదిగిన సొగసైన రత్నాలతో అలంకరించిన చోకర్ నెక్‌లెస్‌ను తన మెడలో అలంకరించుకుంది. నుదుటన తెల్లటి స్టోన్స్‌తో వచ్చిన పాపిట బిల్లను పెట్టుకుని సంపూర్ణంగా కనిపించింది. ఈ ఆభరణాలు అమ్మడి అవుట్‌ఫిట్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. లెహెంగా సెట్ ధరించి ఈ అద్భుతమైన డిజైనర్ జ్యువెల్లరీ పెట్టుకుని కుర్రాళ్ల మనసు దోచేసింది అమైరా.

ఈ గ్రాండ్ అవుట్‌ఫిట్ కు మినిమల్ మేకప్ లుక్‌ను ఎన్నుకుంది అమైరా దస్తూర్. కనులకు సబ్టిల్ పింక్ ఐ ష్యాడో, మస్కరా , వింగెడ్ ఐ లైనర్ వేసుకుంది. పెదాలకు మావీ లిప్ షేడ్ పెట్టుకుని గ్లామరస్ లుక్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపింది. హెయిర్ స్టైలిస్ట్ మాధవ్ అమైరా కురులను అందంగా తీర్చిదిద్దితే ,ఫ్యాషన్ స్టైలిస్ట్ మాల్వికా అమైరా అందానికి మెరుగులు దిద్దింది.
