Steyn Comments on Sanju Samson: క్రికెట్ ఆట అంటే పరిచయం లేని వారుండరు. ఇంతగా పేరొందిన క్రికెట్ లో సంజూ శాంసన్ ఆడిన తీరుకు స్టెయిన్ ఫిదా అయిపోయాడు. అతని బ్యాటింగ్‌ను తాను ఐపీఎల్‌లోనే చూశానని, అంతే కాకుండా యువరాజ్ సింగ్‌ని సంజూ శాంసన్ తో పోలుస్తూ సౌతాఫ్రికా మాజీ పేస్ బౌలర్ డేల్‌స్టెయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆకక్తికరంగా మారింది. అవేమిటంటే యువరాజ్‌లో ఉన్న సత్తా అతనిలో కూడా ఉన్నదని శాంసన్ కూడా ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగలడని ప్రశంసించాడు.కాని 39వ ఓవర్లో కగిసో రబాడా నోబాల్ వేయడం తనను ఆందోళనకు గురి చేసిందని చెప్పాడు.
సంజూ శాంసన్ తనకు అప్పుడప్పుడూ వస్తున్న అవకాశాలను సంజూ సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో సంజూ శాంసన్ చెలరేగి ఆడారు. ఇక ఇప్పుడు సౌతాఫ్రికాపై 40 ఓవర్లలో 250 రన్స్ చేజింగ్‌లోనూ సంజూ 63 బాల్స్‌లోనే 86 రన్స్ చేసి మరోసారి అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానుల ప్రశంసలను అందుకుంటున్నాడు.
కేజీ (కగిసో రబాడా) తన ఓవర్ చివరి బంతికి నోబాల్ వేసిన సయమంలో ఇలా జరగకూడదని నేను ప్రార్థించాను. ఎందుకంటే సంజూ శాంసన్‌లాంటి బ్యాటర్, అతడున్న ఫామ్‌లో ఏదైనా జరగొచ్చు. షంసి చివరి ఓవర్ వేయబోతున్నాడు. అతను బంతితో దారుణంగా విఫలమయ్యాడని సంజూకి తెలుసు. రబాడా నోబాల్ వేసినప్పుడు నేను ఆందోళనకు గురయ్యాను. టీమ్‌కు 30+ రన్స్ అవసరమైనా గెలిపించగలడు” అని స్టెయిన్ అన్నాడు.
Steyn Comments on Sanju Samson:
ఈ మ్యాచ్‌లో ఇండియా విజయం కోసం 30 రన్స్ అవసరం కాగా.. సంజూ 20 రన్స్ చేయడం విశేషం. షంసి వేసిన ఆ ఓవర్లో ఒక సిక్స్, మూడు ఫోర్లు బాదాడు. మరో రెండు షాట్ల దూరంలో నిలిచిపోయానని, అయితే తన ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నట్లు శాంసన్ మ్యాచ్ తర్వాత చెప్పాడు.