Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో రిషి తన ఫోన్లో రికార్డు చేసుకున్న వసు వీడియోను చూస్తూ ఉండగా ఇంతలో వసు వస్తుంది. ఆ వీడియోను చూసి వసు నాకు తెలియకుండా వీడియో తీశారా అంటే నువ్వు నాకు తెలియకుండా నా ఆఫీస్ క్యాబిన్లో ఏం చేశావని ప్రశ్నిస్తాడు రిషి. తరువాత మీరు నా పేరును ఫోన్లో పొగరు అని రాసుకున్నారు కదా నేనేమైనా అన్నానా అంటుంది. రిషి కూడా నువ్వు నన్ను జెంటిల్మెన్ అని పిలుస్తావు కదా నేనేమైనా ఫీల్ అయ్యానా అని సరదాగా మాట్లాడుకుంటారు.
తరువాత సన్నివేశంలో దేవయాని, జగతి వద్దకు వచ్చి ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటే వసు ఎప్పటికీ రిషి జీవితంలోకి రాకూడదు. మన స్థాయికి తగ్గ సంబంధం చూసి చేస్తే అందరూ బాగుంటారు. మనమంతా కలిసి ఉండవచ్చు. లేదంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే అంటూ జగతికి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది దేవయాని. మరొకవైపు మహేంద్ర, వసుతో ఈ గురుదక్షిణ ఒప్పందం ఇంతటితో వదిలేద్దాం. రిషి బాధను చూడలేకపోతున్నాను. రోజురోజుకు తలనొప్పి సమస్యలు పెరుగుతున్నాయని వసుకు చెబుతాడు. అందుకు వసు మొదట్లో రిషి సార్ కు జగతి మేడం అంటే చాలా కోపం ఉండేది. కానీ స్వయంగా ఆయనే ఇంటికి పిలిచారు. తర్వాత సార్ అని కాకుండా రిషి అని పిలవమని చెప్పారు. నాకు రిషి సార్ కళ్ళల్లో ప్రేమ కనపడుతుంది. నేను కేవలం రిషి సార్ నుండి ప్రేమను మాత్రమే కోరుకోలేదు. ఆయన బాధలో, సంతోషంలో నాకు కూడా బాధ్యత ఉంది. ఈ విషయంలో నేను ఎవరి మాట వినదల్చుకోలేదు అని చెప్పడంతో మహేంద్ర సంతోషిస్తాడు. తర్వాత వసు మీరు నన్ను పరీక్షిస్తున్నారా అంటే కాదు నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు పరిస్థితులను బట్టి నువ్వు మారతావు అనుకున్నాను కానీ ఇలా పట్టుదలతో ఉంటావని గ్రహించలేకపోయాను అంటాడు.
తర్వాత సన్నివేశంలో దేవయాని, ధరణితో ఇంట్లో అందరూ వసు గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతుంది. ఏముంది వసు చాలా మంచి అమ్మాయి, తెలివితేటలు బాగా ఉన్నాయి అని అంటూ ఉండగా నేను అడిగింది వసు ఎలాంటిదో కాదు వసు గురించి మహేంద్ర జగతులు ఏమనుకుంటున్నారు అంటుంది. వాళ్లు కూడా ఇదే అనుకుంటున్నారు అంటే నీ మట్టిబుర్రకు ఏమీ అర్థం కాదు నువ్వు పని చేయడానికి మాత్రమే ఉపయోగపడతావు ముందు వెళ్లి నాకు ఒక స్ట్రాంగ్ టీ పెట్టి తీసుకురా అంటుంది.
Guppedantha Manasu:
తర్వాత సన్నివేశంలో జగతి, వసు తో ఏం జరుగుతుంది అని అడగక ఏముంది మేడం మామూలే కదా అంటుంది వసు. అప్పుడు జగతి కోపంతో నువ్వు రిషి ఇద్దరు ఇద్దరే. పక్క వాళ్లకు తెలియకుండా బాగానే మేనేజ్ చేస్తారు. నీకు అర్థం కాని విషయం ఏమిటంటే ఒక చిన్న అవకాశం దొరికిన వాడుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. దయచేసి గురుదక్షిణ ఒప్పందం గురించి మర్చిపో. ఈ విషయంలో ఎందుకు నీకు అంత మొండి పట్టుదల అంటూ, నీ జీవితం నువ్వు చూసుకో నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఉండగా ఇంతలో మహేంద్ర వస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.