Nayanatara : దక్షిణాదిని తన నటన, అందంతో ఒక ఊపు ఊపేస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఎక్కడో కేరళలో పుట్టి కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. ఆపై టాలీవుడ్‌ను షేక్ చేసి లేడీ సూపర్ స్టార్‌గా.. పేరు తెచ్చుకోవడం అందరికీ సాధ్యం కాదు. అమ్మడు తాజాగా బాలీవుడ్‌లో సైతం ఎంట్రీ ఇచ్చింది. అమ్మడికి రూమర్స్ కూడా కొత్తేమీ కాదు. స్టార్ హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో ఇలాంటి ఒడిదుడుకులు సర్వసాధారణం. కానీ అమ్మడు మాత్రం చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంది.
మరి అమ్మడు చవి చూసిన చేదు అనుభవాల నేపథ్యంలో తప్పు ఎవరిది? అన్న విషయం తెలియదు కానీ అమ్మడు మాత్రం అంతిమంగా ట్రోల్స్ ఎదుర్కొంది. నటుడు శింబుతో ప్రేమాయణం ఆ తరువాత బ్రేకప్.. ఆపై ప్రభుదేవాతో పెళ్లి వరకూ వెళ్లింది కానీ ఏమైందో ఏమో పెళ్లిపీటలెక్కకుంటానే ఆయనకూ గుడ్ బై చెప్పేసింది. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం.. కొంతకాలం డేటింగ్.. ఆ తరువాత ఇటీవలే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అమ్మడు అటు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే నటనపై సైతం దృష్టి సారించింది.
అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో తాజాగా ఒక న్యూస్ అభిమానులను కలవర పెడుతోంది. అమ్మడు త్వరలోనే నటనకు గుడ్ బై చెప్పనుందట. దీనికి కారణం లేకపోలేదు. నయన్‌కి 40 ఏళ్లు వచ్చాయి. అమ్మడు అమ్మతనం కోసం ఆరాటపడుతోందని సోషల్ మీడియా టాక్. ఈ సమయంలో కూడా పిల్లల్ని కనకుంటే మున్ముందు మరింత కష్టమవుతుందని నయన్ దంపతులు భయపడుతున్నట్టు టాక్. ఈ క్రమంలోనే నటనకు గుడ్ బై చెప్పి పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలని భావిస్తున్నారట. లేడీ సూపర్ స్టార్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్న నయనతార అంత సులభంగా నటనకు దూరం కాగలుగుతుందా? అని మరోవైపు చర్చ జరుగుతోంది.