BIGG BOSS: బిగ్ బాస్ హౌస్ లో తర్వాతి కెప్టెన్ ను ఎంపిక పూర్తి అయింది. బిగ్ బాస్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా ఎక్కువగా ఎంటర్ టైన్ చేసిన ఫైమా, రేవంత్, సూర్య, గీతూ, ఆదిత్య, రాజ్ ను కెప్టెన్ కీర్తి ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొదటి లెవల్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లాగ్ బ్రేకర్స్. మొదటి లెవల్ దాటడానికి పోటీదారులు గార్డెన్ ఏరియాలో ఉన్న ఉడెన్ లాగ్ ని గొడ్డలితో నరికి దాని కింద ఉన్న రోప్ తెగిపోయి రోప్ కి ఇంకోవైపు అటాచ్ అయి ఉన్న శాక్ కింద పడేలా ప్రయత్నించాల్సి ఉంటుంది.
అప్పుడు శాక్ లో ఉన్న పజిల్ పీసెస్ ని తీసుకుని అక్కడ ఉన్న ఫ్రేం లో సరైన విధంగా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఏ ముగ్గురు పోటీదారులు అందరి కన్నా తక్కువ సమయంలో టాస్క్ ని పూర్తి చేస్తారో ఆ ముగ్గురు కెప్టెన్సీ టాస్క్ యొక్క రెండో లెవల్ కి వెళ్తారు. అలా ఈ టాస్క్ లో సూర్య, ఆదిత్య, రేవంత్ లు టాప్ 3 గా నిలుస్తారు. దీంతో గీతూ, ఫైమా, రాజ్ కెప్టెన్సీ పోటీదారుల నుండి తొలగిపోయి ఉంటారు. ఇక కెప్టెన్ అవడానికి బిగ్ బాస్ ఇచ్చిన రెండవ టాస్క్ పేరు గేమ్ ఆఫ్ గార్ లాండ్స్.

ఈ టాస్క్ లో గెలిచి ఇంటి కెప్టెన్ అవ్వడానికి పోటీదారులు వీలైనంత ఎక్కువ మంది ఇంటి సభ్యుల మద్దతును వారు ధరింపజేసే గార్ లాండ్స్ రూపంలో పొందాల్సి ఉంటుంది. టాస్క్ ముగిసే సమయానికి ఏ ఒక్కరి మెడలో అందరి కన్నా ఎక్కువ గార్ లాండ్స్ ఉంటాయో వారు ఇంటి తదుపరి కెప్టెన్ గా నిలుస్తారని బిగ్ బాస్ చెప్తాడు. ముందుగా గీతూ తనదైన శైలిలో వివరణ ఇస్తూ సూర్యకు తన ఓటును వేస్తుంది. తర్వాత రాజ్ వంతు వస్తుంది. తన మద్దతును బాలాదిత్యకు ప్రకటిస్తారు. వసంతి తన మద్దతును రేవంత్ కు ఇస్తుంది. కీర్తి సూర్యకు సపోర్ట్ చేస్తుంది. ఇక అర్జున్ తన ఓటును రేవంత్ కు వేస్తాడు. బాలాదిత్యకు తన మద్దతును ప్రకటిస్తుంది సుదీప.
శ్రీసత్య ఊహించిన విధంగా బాలాదిత్యకు సపోర్ట్ చేస్తుంది. రోహిత్ మద్దతు సూర్యకు లభిస్తుంది. ఇక ముందుగా డీల్ కుదుర్చుకున్నట్లుగానే ఇనయ మద్దతు రేవంత్ కి ఇచ్చి సూర్యకు హగ్ తో సరిపెడుతుంది. మెరీన కూడా రేవంత్ కు మద్దతు ఇస్తుంది. ఊహించని విధంగా బాలాదిత్యకు ఫైమా సపోర్ట్ చేస్తుంది. ఇక శ్రీహాన్ అందరూ అనుకున్నట్టుగానే రేవంత్ కు మద్దతు ఇస్తాడు. ఆదిరెడ్డి చాలా ఇబ్బంది పడుతూ రేవంత్ కు సపోర్ట్ చేస్తాడు. ఇక చంటి తన మద్దతును సూర్యకు సపోర్ట్ చేస్తారు. దీంతో హౌస్ లో మెజారిటీ సభ్యుల మద్దతు సంపాదించిన రేవంత్ చివరకు కెప్టెన్ గా ఎంపిక అవుతాడు. బిగ్ బాస్ సూచన మేరకు రేవంత్ హౌస్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.