మేకప్ వేసుకుంటున్న దురందర దగ్గరికి వస్తుంది హాసిని. గోడకు సున్నం వేసుకున్న మేకప్ వేసుకున్నా ఒకటే అంటూ ఎగతాళి చేస్తుంది. ఏంటి అత్తయ్య దుకాణం పెట్టావ్ అంటూ వస్తాడు వల్లభ కూడా. ఇద్దరు పిల్లల్ని చంకల వేసుకుని వస్తుంది నయని. హాసిని ఎదురుపడి అమ్మవారిలా ఉన్నావంటూ పొగడుతుంది. హాసిని తీసుకెళత్తున్న గిన్నెలో పాప ఎవరికీ కనిపించకుండా చేయి పెడుతుంది. ఆ నీళ్లనే తీసుకెళ్లి దురందరకు ఇస్తుంది హాసిని. అందులో కసి చేయి పెట్టగా చుర్రుమంటాయి నీళ్లు. దురంద కూడా పెట్టగా కాలిపోతుంది చేయి. అందరూ కలిసి హాసినిని తిడతారు. నేను చల్లటి నీళ్లే తీసుకువచ్చా కానీ వచ్చేటపుడు ఏం జరిగింది అంటూ గుర్తు తెచ్చుకుంటుంది హాసిని. బంగారుతల్లిని ముద్దు పెట్టుకుంటానంటూ వెళ్లిపోతుంది హాసిని. తనని పిచ్చిదానిలా భావిస్తారు వల్లభ, కసి.
విశాల్ గదిలోకి వెళ్తున్న విక్రాంత్‌ని గమనిస్తుంది సుమన. ఎవరూ లేరంటూ తన ల్యాప్ టాప్‌ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు విక్రాంత్. విశాల్ వచ్చి ల్యాప్ టాప్ లాక్కుంటాడు. ఆఫీస్ వర్క్ పెండింగ్ అవుతుంది ల్యాప్ టాప్ కావాలంటాడు విక్రాంత్. రెండు రోజులు లీవ్ పెట్టమని సూచిస్తాడు విష్. అలా కుదరదని విక్రాంత్ తెగేసి చెప్పడంతో.. అయితే ఇందులో ఏదో ఉండి ఉంటుందని అనుమానిస్తాడు విశాల్. సుమన అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తమ్ముడికి అర్థం అయ్యేలా చెప్పి అక్కడి నుంచి ల్యాప్ టాప్ తీసుకుని వెళ్తాడు విష్.
నయని పిల్లల్ని ఉయ్యాలలో వేసి ఊపుతుంది. లచ్చిం దేవిలా ఆడిస్తున్నావంటూ పొగడతాడు నయనని బాబాయ్. అపుడే నయనికి తల దగ్గర మంటలా అనిపిస్తుంది. మంటల్లో అంటుకుపోతున్న తిలోత్తమ కనిపిస్తుంది. అంటే తను కాలి బూడిదైపోతుందా.. నా కడుపున పుట్టి ప్రతీకారం తీర్చుకుంటానన్నారు కదా. తిలోత్తమకి ఏం కాకుడదు. తను గాయత్రమ్మ చేతిలోనే అంతం అవ్వాలి అనుకుంటుంది నయని మనసులో. పిల్లల్ని ఆడిస్తున్న బాబాయి దగ్గరికి వచ్చి నేను బయటికి వెళ్లిస్తానని చెబుతుంది నయని.
సీన్ కట్ చేస్తే.. ‘స్వామీ నాకు వచ్చింది కలనా’ అని అడుగుతుంది నయని. అత్తయ్యకు నిజంగానే అలా జరుగుతుందా అంటూ ప్రశ్నిస్తుంది. ‘అది భగవత్సంకల్పం. మీ అత్త తిలోత్తమ చావు కాయం. జరగబోయేదాన్ని నాక వివరించడానికి ఎందుకు వచ్చావ్. వెళ్లిపో’ అంటాడు స్వామీ. అలా చెప్పి నన్ను సాగనంపకండి. మీరే నాకు దారిచూపాలని వేడుకుంటుంది నయని. మృత్యువుకు దారి చూపనక్కర్లేదు. దాని పని అది చేసుకుపోతుంది అంటాడు స్వామీ. ‘అలా జరగకూడదు. తిలోత్తమ అత్తయ్య బతకాలి’ అంటుంది నయని. నువే కదా తన చావు చూడాలన్నావ్.. ఇపుడు మాట మారుస్తున్నావేంటి నయని అంటాడు స్వామి. ‘గాయత్రమ్మ గారి ఆశయానికి అర్థం ఉండదు. తను నా కడుపున పుట్టి ప్రతికారం తీర్చుకుంటానన్నారు. ఇపుడు ఇలా జరిగితే పునర్జన్మకు ఫలితం ఉండదు కద’ స్వామీ అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది నయని. విశాలక్షి అమ్మ వారినే నమ్ముకున్నా.. నేను సుమంగళిగానే పోతాను కానీ.. అమ్మవారి చేతిలో కాకుండా తిలోత్తమ అత్తయ్య అంతం అవడం నాకు ఇష్టం లేదు అంటుంది నయని స్వామితో. ఏమో ఎవరికి తెలుసు మీ అమ్మగారే వచ్చి తిలోత్తమని హరించవచ్చుకదా అంటాడు స్వామీ. గాయత్రి అమ్మగారు వస్తారు. అత్త కోడలిగా కాకుండా తల్లి బిడ్డల్లా ఒకటవుతాం. ఆరోజు వరకు తిలోత్తమ ప్రాణాలతో ఉండాలని కోరుకుంటుంది నయని. మా ఇంటికి వచ్చి తిలోత్తమకు రక్షణ కవచం కట్టమని వేడుకుంటుంది స్వామిని. అందర్నీ కాపాడే నువే ఆ పని చేయగలవ్ అంటాడు స్వామీ. నేను చెప్తే వినరని మీరే రావాలని అడుగుతుంది. దాంతో సరే రేపు ఉదయం వస్తా.. ఆఖరి నిర్ణయం అమ్మవారిదే అంటాడు. మీరాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తా.. వస్తాను స్వామీ అంటూ వెళ్లిపోతుంది నయని.
ఆ తర్వాత సీన్‌లో పిల్లల్ని ఆడిస్తాడు దురంద భర్త. తనని అలా చూసి ఎగతాళి చేస్తుంది దురందర. హాసిని మాత్రం పగలబడి నవ్వుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. దానికి అంత గట్టిగా నవ్వాలా? అంటాడు వల్లభ. పిల్లల బాధ్యతల్ని భుజాన వేసుకున్న శివగామి కనిపించడం లేదేంటి అని అడుగుతుంది కసి. ఈ టైంలోనా అంటాడు విశాల్. ‘ఏంటి నాన్నా.. నీ భార్య నీకు కూడా చెప్పకుండా వెళ్లిందా’ అని ప్రశ్నిస్తుంది తిలోత్తమ విశాల్ని. ఆ తరువాత ఏం జరగనుంతో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..