సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మంచి స్పీడ్ మీద ఉంది. తనని తాను ఇండియన్ వైడ్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ భాగా హెల్ప్ అయ్యింది. ఒక్కసారిగా ఈ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఆమెకి పాపులారిటీ పెరిగిపోయింది. ఇప్పుడు హిందీలో ఒక సినిమాకి కూడా కమిట్ అయ్యింది. డెబ్యూ మూవీ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి చేస్తుంది. ఇక ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ భాగా సక్సెస్ కావడంతో ఇప్పుడు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో మరో వెబ్ సిరీస్ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ వెబ్ సిరీస్ సీటాబెల్ రీమేక్ గా ఇది తెరక్కబోతుంది.
ఇక ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన ఇప్పటికే క్యాస్టింగ్ ఫైనల్ అయిపోయారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఇది ఉంటుంది. ఇక దీనికోసం సమంత మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం అమెరికా వెళ్ళింది. అక్కడ పెర్ఫెక్ట్ గా ట్రైనింగ్ తీసుకొని త్వరలో ఇండియా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా లెవల్ లో ఆమె నటించిన యశోద, శాకుంతలం సినిమా ప్రమోషన్స్ పై ముందుగా దృష్టిపెట్టి అవి రిలీజ్ తర్వాత వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ చేయబోతుంది అని సమాచారం.
ఇప్పటికే రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన షెడ్యుల్ కూడా ప్లాన్ చేసారనే మాట వినిపిస్తుంది. ఇక ఇందులో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే చేయబోతుంది. ఆమెని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక భారీ బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది అని తెలుస్తుంది. సమంత కూడా ఈ వెబ్ సిరీస్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తనని తాను క్యారెక్టర్ కోసం పెర్ఫెక్ట్ గా మేకోవర్ చేసుకుంటుంది.