Mrunal Thakur : జెర్సీ , సీతారామమ్ బ్యాక్ టు బ్యాక్ హిట్‌లతో మంచి ఊపు మీద ఉంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. అందానికి అందం దానికి నటన తోడవ్వడంతో ప్రేక్షకులు మృణాల్ ఠాకూర్ కు నీరాజనాలు పలుకుతున్నారు. వారి ప్రేమకు రిటర్న్‌గా ఈ కుందనాల బొమ్మ అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌ను ధరించి అందమైన ఫోటోలను దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. తాజాగా మృణాల్ స్ట్రాప్‌లెస్ పింక్ గౌన్ వేసుకుని రాకుమారిలా తళుక్కుమంది. కుర్రాళ్ల మనసును మరోసారి దోచేసింది.

Mrunal Thakur : అంతర్జాతీయ డిజైనర్ టార్న్ హంగ్ ఈ స్టన్నింగ్ పింక్ గౌన్‌ను డిజైన్ చేశారు. మృణాల్‌ను ప్రిన్సెస్ లుక్‌లో చూపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. ఈ అవుట్‌ఫిట్‌లో ఉన్న పిక్స్‌ను మృణాల్ ఒకదానితరువాత ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ కింద ‘వన్స్ అపాన్ ఏ డ్రీమ్ అని’ క్యాప్షన్‌ను జోడించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఆఫ్ షోల్డర్ డీటైల్స్‌తో ప్లంగింగ్ నెక్‌లైన్‌తో , స్వీపింగ్ ట్రయల్స్‌తో బోల్డ్ ట్విస్ట్‌లో వచ్చిన ఈ అవుట్‌ఫిట్ మృణాల్ కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. నెక్‌లైన్ దగ్గర వచ్చిన సీ షెల్ డీటైల్స్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. లేలేత గులాబీ రంగు గౌనులో మృణాల్ దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా కనిపించింది. కథలలోని రాకుమారిలా కవ్వించింది.

స్టైలిస్ట్ మోహిత్ రాయ్, శుభి కుమార్‌లు మృణాల్ అందానికి మెరుగులు దిద్దారు. , మృణాల్ తన కనులకు సబ్టిల్ ఐ ష్యాడో వేసుకుని, పర్ఫెక్ట్ ఐ బ్రోస్ ను తీర్చిదిద్దుకుంది. పెదాలకు న్యూడ్ పింక్ లిప్ షేడ్ పెట్టుకుని మెరిసేటి ఛర్మంతో మెస్మరైజింగ్ లుక్స్‌తో అదరగొట్టింది. ఈ అవుట్‌ఫిట్‌కు కాంట్రాస్ట్‌గా ఉండేందుకు పర్పుల్ కలర్ ఇయర్ రింగ్స్ ను చెవులకు అలంకరించుకుంది. చేతి వేళ్లకు స్టేట్‌మెంట్ ఉంగరాలను పెట్టుకుంది.

మృణాల్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నటికి అద్భుతమైన అవుట్ ఫిట్స్‌తో అందరి చూపును తనవైపు ఎలా తిప్పుకోవాలో బాగా తెలుసు. మోడ్రన్ అవుట్‌ఫిట్ అయినా ట్రెడిషనల్ డ్రెస్ అయినా తన పర్సనాలిటీకి తగ్గట్లుగా ఎన్నుకుని ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వేసుకున్న ఈ అవుట్‌ఫిట్ కూడా కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది.

మహారాష్ట్రకు చెందిన మృణాల్ బుల్లితెరలో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత ఓ మరాఠీ ఫిల్మ్‌లో తొలిసారిగా హీరోయిన్‌గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది . 2019లో వికాస్ భల్ బయోగ్రాఫికల్ మూవీ సూపర్ 30తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్. ఆ తరువాత జెర్సీ సినిమాలో కనిపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. లేటెస్ట్‌గా తెలుగులో సీతారామమ్ చిత్రంలో సీతా మహాలక్ష్మిగా తన నటనతో అందరిని మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పిప్పా సినిమాతో మరోసారి అలరించబోతున్నట్లు తెలుస్తోంది.
