Samantha:ఈ మధ్యకాలంలో హీరోయిన్లు సినిమాలలో కేవలం గ్లామర్ రోజుల్లో మాత్రమే కాకుండా విభిన్న పాత్రలలో నటించడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే హీరోలకు పోటీగా యాక్షన్ సన్ని వేషాలలో నటించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఇక ఇప్పటికే చాలామంది హీరోయిన్లు రా ఏజెంట్లుగా నటించడం కోసం ఇష్టత చూపుతున్నారు. అయితే సమంత సైతం ఇలాంటి పాత్రలో నటించడానికి చాలా ఇష్టంగా ఉన్నారని తెలుస్తోంది.
సమంత ఇలాంటి విభిన్న పాత్రలలో నటిస్తుంది తెలుగులో మాత్రం కాదండోయ్.. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ ఇండియాలో భీభత్సమైన యాక్షన్లు ఛేజులు చేసే ఆఫీసర్ పాత్రలో సరికొత్తగా కనిపించబోతోందని తెలుస్తుంది. అయితే ఇది ఓటీటీ కంటెంట్ అని తెలుస్తోంది. ఇదివరకే సమంతకు ది ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
సమంతకు ఇలాంటి బ్లాక్ బస్టర్ అందించిన రాజ్ అండ్ డికెలు దీన్ని రూపొందించబోతున్నారు. అవెంజర్స్ సృష్టికర్తలు రస్సో బ్రదర్స్ ఇచ్చిన గత ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతున్నట్లు సమాచారం.ఈ వెబ్ సిరీస్ కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నటువంటి సమంతా ఈ వెబ్ సిరీస్ షూటింగ్లో త్వరలోనే పాల్గొనబోతున్నారు.
Samantha: రా ఏజెంట్ గా సమంత
నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పనులు ప్రారంభమవుతున్నాయని సమాచారం.ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ఒరిజినల్ అమెరికన్ వెర్షన్లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటించారు. ఈ క్రమంలోనే మన తెలుగు ప్రేక్షకులకు అనుకూలంగా ఈ సిరీస్ లో ప్రియాంక చోప్రా నటించిన పాత్రలో సమంత నటించిన బోతుంది. ఏది ఏమైనా హాలీవుడ్ రేంజ్ లో ఈ వెబ్ సిరీస్ ద్వారా సమంత ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలియడంతో ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.