Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా ఏ అవుట్‌ఫిట్ ధరించినా అది ఆమెకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్పోర్ట్స్ బ్రా, టైట్స్‌తో జిమ్‌కు వెళ్లినా, బీచ్‌లో బికినీతో హల్ చల్ చేసినా, పండుగల్లో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించినా, ప్లేస్ మారుతుందే కానీ ఆమె స్టైలిష్ ఫ్యాషన్ లుక్స్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఎప్పుడూ ఈ భామ అవుట్‌స్టాండింగ్ అవుట్‌ఫిట్స్‌ను ధరించి అందరిని ఆకట్టుకుంటుంది. ఇక వెడ్డింగ్ కు హాజరైనప్పుడు ఈషా ఎత్నిక్ లుక్స్‌తో అందరిని మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా రిచా చద్దా, అలీ ఫజల రిసెప్షన్‌కు హాజరైన ఈషా గుప్తా ఎత్నిక్ అవుట్‌ఫిట్‌లో ఏంజెల్ మెరిసిపోయింది. వెడ్డింగ్ రిసెప్షన్‌కు చాలా మంది సెలబ్రిటీలు హాజరైనా అద్భుతమైన లెహెంగాను ధరించి ఈషా గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశం నుంచి వస్తున్న సూర్యకిరణాలను ఆలింగనం చేసుకుంటూ అదిరిపోయే లెహెంగా సెట్‌లో ఫోటోలు దిగుతూ వనదేవతలా తళుక్కుమంది . మెరిసేటి ఎంబ్రాయిడరీ తళుకులు అమ్మడి సొగసులను మరింత హైలెట్ చేశాయి.

Esha Gupta : ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఈషా గుప్తా సిల్వర్ టోన్డ్ లెహెంగా సెట్‌ను ధరించింది. డీప్ నెక్‌లైన్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్‌తో డిజైన్ చేసిన మెరిసేటి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను వేసుకుంది ఈషా గుప్తా. బ్లౌజ్ కు ఇచ్చిన విధంగానే హెవీ ఎంబ్రాయిడరీతో వచ్చిన మెరిసేటి స్కర్ట్ ను ధరించింది ఈషా. బార్డర్లలో పూల ఎంబ్రాయిడరీతో వచ్చిన తెల్లటి రంగులో ఉన్న దుపట్టాను తన భుజంపై నుంచి వేసుకుంది.

ఈ అవుట్ ఫిట్‌కు తగ్గట్లుగా కాస్ట్‌లీ రాళ్లతో పొదిగిన నెక్‌లెస్‌ను మెడలో అలంకరించుకుంది. చెవులకు మ్యాచింగ్ డాంగ్లింగ్ ఇయర్‌రింగ్స్ , చేతికి బ్రేస్‌లెట్ , చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకుంది. తలలో పూలు పెట్టుకుని , డివీ మేకప్ తో గ్లామర్స్ లుక్స్‌తో యూత్‌ను ఫిదా చేసింది ఈషా.

ఈ అందమైన లెహెంగా సెట్‌ను మృణాలినీ రావు కలెక్షన్స్ నుంచి సేకరించింది ఈషా. మహేష్ జ్యువెల్లరీస్ నుంచి ఆర్నమెంట్స్‌ను ఎన్నుకుంది. స్టైలిస్ట్ చాందిని ఈషాకు స్టైలిష్ లుక్స్ అందించగా మేకప్ ఆర్టిస్ట్ బిల్లీ మానిక్ ఈషా అందానికి మెరుగులు దిద్దాడు. టీనా ముఖర్జీ ఈషా కురులను అందంగా తీర్చిదిద్దింది.

గతంలోనూ ఈషా అద్భుతమైన డిజైనర్ లెహెంగా సెట్‌లను ధరించి ఫెస్టివ్ , వెడ్డింగ్ ఫ్యాషన్‌ను ప్రమోట్ చేసింది. బ్రైట్ బ్లూ కలర్ లెహెంగా వేసుకుని హాట్ ఫోటో షూట్‌లు చేసి ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్ చేసింది. భారీ ఎంబ్రాయిడరీతో మెరుపుల అలంకరణలతో వచ్చిన ఈ నీలిరంగు లెహెంగాలో అదిరిపోయింది ఈషా గుప్తా.

అంతకు ముందు సిల్వర్ అలంకరణలతో వచ్చిన డిజైనర్ లెహంగాలోనూ ఓ హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. డీప్ స్వీట్ హార్ట్ నెక్‌లైన్‌తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ల మతులుపోగొట్టింది. ఈ అవుట్‌ఫిట్ పిక్స్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.