God Father: మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రం. మలయాళంలో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో కూడా విజయదశమి సందర్భంగా విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఇకపోతే ఇందులో చిరంజీవి బ్రహ్మ అనే పాత్రలో నటించారు.
ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార చిరంజీవికి చెల్లెలు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. సత్యదేవ్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వంటి పలువురు స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాలో నటించి సందడి చేశారు. ఇకపోతే ఈ సినిమాలో నయనతార చిరంజీవికి తండ్రి పాత్రలో నటించిన నటుడు గురించి ఈ తరం వారికి తెలియకపోయినప్పటికీ ఈయన కూడా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో.
ఇలా ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన ఇండస్ట్రీకి దూరమై తిరిగి ఈ సినిమా ద్వారా చిరంజీవి తండ్రిగా రీ ఎంట్రీ ఇచ్చారు. మరి చిరంజీవి నయనతారకు తండ్రిగా నటించిన ఈ నటుడు మరెవరో కాదు సర్వదామన్ బెనర్జీ.1986లో దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాఎథ్ తెరకెక్కించిన సిరివెన్నెల సినిమా ద్వారా నటి సుహాసిని తో కలిసి నటించారు.
God Father: సిరివెన్నెల సినిమాతో హిట్ కొట్టిన సర్వదామన్
ఈ సినిమాలో సర్వదామన్ అందుడి పాత్రలో నటించారు.ఈయన ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట ఇప్పటికి శ్రోతల మదిని ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఈ సినిమాకు సీతారామశాస్త్రి రచయితగా పరిచయం అవ్వడమే కాకుండా ఎంతో అద్భుతమైన పాటలు అందించడంతో ఆయన పేరు కాస్త సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారిపోయింది.ఇలా సిరివెన్నెల సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన ఈయన 35 ఏళ్ల తర్వాత గాడ్ ఫాదర్ సినిమా ద్వారా మెగాస్టార్ తండ్రి పాత్రలో ప్రేక్షకులను సందడి చేశారు.