Parental Tips: మన పిల్లలు జీవితం లో పైకి రావాలంటే దానిలో తల్లిదండ్రుల ది ప్రధాన పాత్ర. తల్లి ఎప్పుడూ పిల్లలకు ప్రేమ చూపిస్తుంది. అలాగే క్రమ శిక్షణ విషయ లో తండ్రికి చాలా బాధ్యత వుంది. ఒక ఇరవై ఏళ్ల కిందట తండ్రి ఇంట్లోకి వస్తున్నాడు అనగానే పిల్లలు అందరూ సైలంట్ అయిపోయి పుస్తకాలు చదువుతూ వుండేవారు. కాని ఇప్పటి సమాజంలో తండ్రి బాధ్యతలు మారాయి.కాలం తో పాటు తండ్రి పాత్ర కూడా మారింది మారాలి కుడా. ఇప్పటి రోజుల్లొ భయ పడితే బాగు పడటం లేదు. తండ్రి ఎలావుంటే పిల్లలు భవిష్యత్ బాగుంటుందో తెలుసుకుందాం.
మీ పిల్లల తో వుండే సమయం కచ్చితంగా పెరగాలి. మీరు ఎంత పెద్ద బిజినెస్ మాన్ ఆయినా, ఎంత పెద్ద ఆఫీసర్ ఆయినా కూడా మీరు మంచి తండ్రి కావాలనుకుంటే, మీ పిల్లల తో సమయం గడపండి. వారిని దగ్గరకు తీసుకోండి, పక్కన కూర్చుని తల నిమరండి చాలు. మీ మధ్య బంధం మరింత బలపడుతుంది.పిల్లలకు మొదటి రోల్ మోడల్ వారి తండ్రే . మీరు ఏమి చేస్తే వారు అదే చేస్తూ వుంటారు. చిన్నప్పుడు మీరు గమనించండి, మీరు ఏదైనా పని చేస్తుంటే వాళ్ళు వచ్చి అదే చేస్తుంటారు. వారి ముందు నిజాయితీ గా ఉండండి. సిగరెట్, మందు తాగడం పిల్లల ముందు అస్సలు చేయవద్దు.
మీరు మీ ప్రేమ చూపిస్తు స్నేహితుడు లా వుండాలి. ఏ విషయం ఆయినా కూడా మీతో పంచుకునే లా వుండాలి. అది తప్పు అయినా ఒప్పు ఆయినా కూడా.
పిల్లలు ఏది చెప్పినా విసుక్కోకుండా వారు చెప్పేది వినే ప్రయత్నం చేయండి.పిల్లలు అల్లరి చేసినా వారిపై అరవటం, కొట్టడం చేయొద్దు. వారికి ఎలా వుండాలి అని చెప్పాలి. బాగా చిన్న తనం లో కొంచెం పెంకి తనం వుంటుంది, అప్పుడే ఓపిక గా వుండాలి.
Parental Tips:
ఇప్పుడు వున్న పరిస్థితుల్లో వారికి పాకెట్ మనీ ఇవ్వటం, మాంచి ఫోన్ ఇవ్వడం కాదు మంచి సంస్కారం ఇవ్వాలి. కొద్దిగా దారి తప్పు తున్నప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. చాలా మంది పిల్లలు లవ్ ఎఫైర్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు. తెలుసా, మీరు వారి గురించి అస్సలు పట్టించు కోరు, మొక్కు మొహం తెలియని వాడు, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి, రెండు మాటలు చెబితే చాలు వాళ్ల వలలో పడి పోతారు. కాబట్టి మీ పిల్లలకు కచ్చితంగా సమయం కేటాయించాలి. అప్పుడే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.