Bigg boss 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో నిన్నటి ఎపిసోడ్ కాస్త ఇప్పటి వరకూ జరిగిన వాటితో పోలిస్తే హైలైట్ అని చెప్పాలి. రెండు రోజుల పాటు తన బర్త్ డే సందర్భంగా తను చెప్పిందల్లా వింటూ తనను హౌస్‌మేట్స్ ఎంటర్‌టైన్ చేశారని.. నేడు కంటెస్టెంట్ల కోరికలు వినాలనుకుంటున్నట్టు తెలిపారు. అందరూ ఒక్కొక్కరుగా తమ కోరికలు చెప్పేసి బాగా ఎమోషనల్ అయ్యారు. శ్రీహాన్ సిరికి కొన్ని బాధ్యతలను అప్పగించారు. అనాథలు, వృద్ధులకు హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా సాయం చేయమనడం.. తన తల్లిదండ్రులకు కాల్ చేస్తూ ఉండమని చెప్పి బాగా ఎమోషనల్ అయ్యాడు.
తను బిగ్‌బాస్‌కి వచ్చే ముందే తనకు ఒక పాప పుట్టిందని.. ఆ పాప నామకరణ మహోత్సవాన్ని చూడాలనుకుంటున్నట్టు చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ కూడా తమ కోరికలను బయటపెడుతూ ఎమోషనల్ అయ్యారు. వీళ్లందిరికీ గీతూ కాస్త డిఫరెంట్‌గా చెప్పింది. తన పెంపుడు కుక్కలు ఓరియో, ఫిడోల బొచ్చు కావాలని… అది నాకు చాలా అమూల్యమైనది చెప్పుకొచ్చింది. ఇది చాలా ఫన్నీగా అనిపించింది. కుక్కలు మనపై చూపించే ప్రేమ, ఎఫెక్షన్ అలాగే ఉంటుంది కాబట్టి తప్పు పట్టాల్సిన పని లేదు.
ఇక రేవంత్ నాకు ముద్దు పెట్టాడు.. అది నాకు నచ్చలేదో అని గీతూ రెండు రోజులుగా చావగొట్టేస్తోంది. ఇదే విషయాన్ని ఆదిరెడ్డి దగ్గర ప్రస్తావిస్తే.. ఆయన సింపుల్ తేల్చేశాడు. అతనేమీ దురుద్దేశంతో పెట్టలేదు అని చెప్పినా కూడా వినిపించుకోదే.. పాడిందే పాట. ఇక ఆగలేక నిన్న రేవంత్‌తో కూడా చర్చించింది. తన బుగ్గ మీద ముద్దుపెట్టడం నచ్చలేదని రేవంత్‌కి గీతూ చెప్పింది. దీనికి రేవంత్ కూడా ఎక్కువగా డిస్కస్ చేయకుండా సింపుల్‌గా సారీ చెప్పాడు. అలాగే ఫైమా కాళ్లపై పడుకున్నావని, కాస్త వాళ్లు కంఫర్టో కాదో చూసుకోమని సూచించింది గీతూ. వెంటనే వెళ్లి ఫైమాకు కూడా రేవంత్ సారీ చెప్పాడు. ఇక్కడ గీతూ కూడా గొడవ పెట్టుకోకుండా అంత కూల్‌గా చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది.