మణిరత్నం దర్శకత్వంలో తమిళ్ ఇండస్ట్రీలో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా, అలాగే భారీ బడ్జెట్ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ మూవీ తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి కాస్తా డివైడ్ టాక్ వచ్చిన కూడా డేస్ నడుస్తున్న కొద్ది ప్రేక్షకాదరణ పెరుగుతుంది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కంటెంట్ కావడంతో, అసలు చోళులు, పల్లవులు ఎవరు, వారి కథ ఏంటి అనే విషయాలని తెలుసుకోవడానికి మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమా చూసిన అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కంటెంట్ ని అర్ధం చేసుకోవడానికి ఒకటికి రెండు సార్లు చూస్తున్నారు. ముఖ్యంగా తమిళనాట అయితే ఈ మూవీకి విపరీతమైన ఆదరణ లభిస్తుంది.
అయితే ఈ సినిమా ఓ వైపు ప్రేక్షకాదరణతో దూసుకుపోతూ ఉంటే మరో వైపు వివాదాలు కూడా వెంటాడటం మొదలయ్యాయి. దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాపై విమర్శలు చేశారు. చోళుల కథకి కాషాయ రంగు అద్దె ప్రయత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాతో దర్శకుడు మణిరత్నం చేశారని విమర్శించారు. అసలు హిందూ అనే అంశమే చోళుల కాలంలో లేదని కానీ కంటెంట్ లో చోళుల పాత్రలని మణిరత్నం అచ్చమైన హిందువులుగా చూపించారని విమర్శించారు. ఇక వెట్రిమారన్ విమర్శలకి కొంత మంది సెలబ్రెటీ ప్రముఖులు కౌంటర్లు కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా కమల్ హాసన్ ఈ పొన్నియన్ సెల్వన్ సినిమా చూసారు.
ఈ సినిమాపై, మణిరత్నం దర్శకత్వంపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. సినిమాని అద్భుతంగా ఆవిష్కరించారని అన్నారు. అదే సమయంలో వెట్రిమారన్ కామెంట్స్ ని సపోర్ట్ చేస్తూ చోళుల కాలంలో హిందుత్వం అనేది అస్సలు లేదని, కేవలం బ్రిటిష్ వారు వచ్చాక సృష్టించిన పదం అని అన్నారు. చోళుల కలంలో మూడే మతాలు ఉండేవని శైవం, వైష్ణవం, జైనిజం ప్రాచూర్యంలో ఉండేవని అన్నారు. చోళులు శైవమతాన్ని అనుసరించే వారుగా సినిమాలో మణిరత్నం చూపించారు. తంజావూర్ బృహదీశ్వర దేవాలయం కూడా చోళుల కాలంలో నిర్మించినదే కావడంతో వారిని శైవ మతానికి చెందిన శివారధికులుగా మణిరత్నం చూపించారు. దీనినే కొంతమంది హిందుత్వ వ్యతిరేకులు తప్పుపడుతున్నారు.