మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి హిట్ చిత్రాలు తీసిన సీనియర్ దర్శకుడు కె విజయ్ భాస్కర్ చాలా రోజుల తర్వాత మెగా ఫోన్ పట్టిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ని రైటర్ గా ఫేమ్ రావడానికి కారణం ఈయనే అని చెప్పాలి. విజయ్ భాస్కర్ తెరకెక్కించిన సినిమాలలో దర్శకుడిగా అతనికి వచ్చిన గుర్తింపు కంటే మాటల రచయితగా త్రివిక్రమ్ కి ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉంటే కె.విజయ్ భాస్కర్ చివరిగా భలే దొంగలు అనే సినిమాని ఇలియానా, తరుణ్ తో తెరకెక్కించారు. ఈ మూవీ హిందీలో హిట్ చిత్రానికి రీమేక్ అనే విషయం చాలా మందికి తెలుసు. ఆ మూవీ అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.
ఇక సుదీర్ఘకాలం గ్యాప్ తర్వాత మరల ఇప్పుడు మెగా ఫోన్ పట్టి కొడుకు కమల్ ని హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నారు. జిలేబి టైటిల్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ లాంచింగ్ జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శివాని రాజశేఖర్ ని ఖరారు చేయడం విశేషం. స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్న శివాని రాజశేఖర్ కి అనుకున్న స్థాయిలో సినిమాలు పడటం లేదు. అందానికి అందం, అలాగే నటనలో కూడా మంచి టాలెంట్ ఉన్న కూడా సరైన హిట్ పడలేదు.
అయితే శివాని చెల్లి శివాత్మిక పాత్రం బోల్డ్ ఫోటోషూట్ లతో అందాల ప్రదర్శన చేస్తూ అవకాశాలు బాగానే అందుకుంటుంది. ఇదిలా ఉంటే శివానికి ఇప్పుడు జిలేబి రూపంలో మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా, తనకి అలవాటైన కామెడీ టచ్ ఉన్న కంటెంట్ తోనే విజయ్ భాస్కర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. కొడుకుకి హీరోగా బ్రేక్ ఇవ్వడానికి మెగా ఫోన్ పట్టారని అర్ధమవుతుంది. మరి శివానికి ఈ సినిమా ఎంత వరకు కెరియర్ పరంగా హెల్ప్ అవుతుందనేది చూడాలి.