గత ఎపిసోడ్‌లో.. దుర్గకి, తనకి ఎలాంటి సంబంధం లేదని కార్తీక్ చెబుతుంది మోనిత. అయినా మోనితపై కార్తీక్‌కి ఉన్న అనుమానం తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. అనంతరం పండుగ ఉందని దీప తన ఇంటిని డెకరేట్ చేస్తుంది. అది చూసి ఏం పండుగ అని కార్తీక్ అడిగిన చెప్పదు. కార్తీక్ పుట్టిన రోజు కావడంతో రాత్రి దీప, డాక్టర్ అన్నయ్య, ఆయన తల్లి సెలబ్రేట్ చేయడానికి మోనిత ఇంటికి వస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 6న ఏం జరిగిందో చూద్దాం..
‘నా జీవితంలోనే పెద్ద పండుగ.. మీ పుట్టిన రోజు పండుగ డాక్టర్ బాబు. హ్యపీ బర్త్ డే డాక్టర్ బాబు’ అని సెలబ్రేషన్స్ కి అసలు కారణం చెబుతుంది దీప. డాక్టర్ అన్నయ్య, ఆయన తల్లి కూడా శుభాకాంక్షలు చెబుతారు. దాంతో.. తన పుట్టిన రోజా అని కార్తీక్ అనుమానంగా అంటాడు. మోనిత మాత్రం ఎలా మర్చిపోయాను అని కంగారు పడుతుంది. ఇదే సంధని భావించిన దీప.. ‘నీకు గుర్తు లేదా డాక్టర్ అమ్మా’ అని వెటకారంగా అంటుంది దీప. అది నిజం కాదని చెబితే పెద్ద ప్రాబ్లెమ్ వస్తుందని మర్చిపోయానని నిజం చెప్పేస్తుంది మోనిత. అంతేకాకుండా.. కార్తీక్ మరి మరి అడగడంతో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంది. అనంతరం తన ఇంటి దగ్గర కేకు కట్ చేయడానికి ఏర్పాట్లు చేశాం పదండి అంటూ డాక్టర్ అన్నయ్య.. కార్తీక్ ని అక్కడి నుంచి తీసుకెళతాడు.
అక్కడికి వెళ్లిన తర్వాత కేకు కట్ చేస్తాడు కార్తీక్. మోనిత, దీప ఒకేసారి కార్తీక్‌కి కేకు తినిపించేందుకు ప్రయత్నించగా.. డాక్టర్ తల్లి కావాలని తగలడంతో మోనిత చేతిలోని కేకు కింద పడిపోతుంది. దాంతో.. ‘వయసు అయిపోయింది కదా.. పొరపాటున కాలు స్లిప్ అయ్యింది’ అని అంటుంది పెద్దావిడ. అది విని అందరూ కావాలనే చేస్తున్నారని తిట్టుకుంటుంది మోనిత. దాంతో.. దీప మాత్రమే కేకు తినిపిస్తుంది. కలకాలం గుర్తుంచుకునేలా సెలబ్రేట్ చేశావని సంతోషం వ్యక్తం చేస్తాడు కార్తీక్. అప్పుడు అదేకాకుండా.. ‘కాలనీలో రక్తదానం.. పేదలకు అన్నదానం.. హాస్పిటల్‌లో రోగులకు పండ్ల పంపిణీ చేయాలి’ అని అంటుంది దీప. అనంతరం.. గతంలో కార్తీక్‌కి దీప ఇచ్చిన పర్సునే మళ్లి ఇస్తుంది. అందులో..’పుట్టినరోజు శుభాకాంక్షలు ‘ అని కార్తీక్‌కి దీప రాసిన స్లిప్ ఉంటుంది. దాంతో.. నిజంగా లాస్ట్ బర్త్ డేకి ఇది ఇచ్చావా అని అడుగుతాడు కార్తీక్. అంతేకాకుండా.. నువ్వేం చేస్తున్నావు అని మోనితని అడుగుతాడు. ఇంతలో పెద్దావిడ మధ్యలోకి వస్తూ.. ‘ఆ పుట్టిన రోజైన నువ్వే జరిపించావా.. లేక మా దీపమ్మ చేసిందా’ అని వెటకారంగా అంటుంది. కార్తీక్ కూడా అదే అడగడంతో మోనిత కంగారుగా నేనే చేశాను అంటుంది.
తెల్లారగానే.. అందంగా రెడీ అయినా దీప.. కార్తీక్ ని గుడికి తీసుకెళ్లడానికి వస్తుంది. అయితే.. మోనిత ఇంటికి వచ్చిన దీపకి ఇంట్లో ఎవరు కనిపించరు. డాక్టర్ బాబు అని ఇల్లంతా తిరుగుతూ పిలుస్తుంది. కానీ ఎవరూ పలకరు. దాంతో.. ఆయన్ని మోనిత ఎక్కడికైనా తీసుకెళ్లిందా అని అనుకుంటుంది దీప. ‘అసలు దుర్గ ఎక్కడి వెళ్లాడు. డాక్టర్ బాబు లేడని అతనికి తెలుసా. తెలిస్తే నాకు చెబుతాడు కదా’ అని వెనక్కి తిరిగి వెళుతున్న దీపకి.. డాక్టర్ అన్నయ్య ఎదురువస్తాడు. దాంతో.. జరిగిన విషయాన్ని చెబుతుంది. అంతేకాకుండా.. మోనిత డాక్టర్ బాబుని ఎక్కడికైనా తీసుకెళ్లిపోయిందని బాధగా అంటుంది. దాంతో.. సాయంత్రం కల్లా వెనక్కి తీసుకొస్తుందిలే అని అంటుంది అంటాడు డాక్టర్ అన్నయ్య.
కార్తీక్‌ని ఎక్కడికో తీసుకెళుతుంటుంది మోనిత. కారులో డ్రైవ్ చేస్తున్న కార్తీక్ నా పుట్టిన రోజుని మర్చిపోయావు కదా అని అడుగుతాడు కార్తీక్. దాంతో.. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దామని.. పనిలో పడి మర్చిపోయానని కథలు చెబుతుంది మోనిత. అది విని.. లాజిక్‌లు మాట్లాడడంతో చిరాకు పడుతుంది మోనిత. దాంతో.. అది వదిలేసి ‘నీ ఫ్రెండ్ దుర్గ ఎక్కడికి వెళ్లాడు’ అని అడుగుతాడు. అదేం లేదని అంటుంది మోనిత. దాంతో.. ‘నన్ను వంటలక్కకి దూరంగా తీసుకెళుతున్నావా లేక నీకు దుర్గకి అడ్డు వస్తున్నానని చంపడానికి తీసుకెళుతున్నావా’ అని అంటాడు కార్తీక్. అదేం లేదని బాధగా అంటుంది మోనిత. లేడీ విలన్ ఎన్నిసార్లు చెప్పిన కార్తీక్ వినడు. దాంతో.. ‘రెండు రోజులకే నాకు ఇలా ఉందంటే.. పదేళ్లు నీ టార్చర్‌ని దీప ఎలా భరించిందో’ అని మనసులో అనుకుంటుంది మోనిత.
అనంతరం.. ఇంద్రుడు, చంద్రమ్మ, సౌర్య టిఫిన్ చేయడానికి ఓ హోటల్‌కి వెళతారు. అప్పుడే డబ్బులు ఉన్నాయా లేవ అని ఇంద్రుడిని అడుగుతుంది చంద్రమ్మ. ఇంతలో.. ‘అసలు మనం ఎక్కడికి వెళుతున్నాం’ అని అడుగుతుంది సౌర్య. సంగారెడ్డిలో ఓ జాతరకి వెళుతున్నాం అని అంటుంది చంద్రమ్మ. దాంతో.. అమ్మనాన్న కూడా వస్తారా అని సందేహంలో పడుతుంది సౌర్య. ఆ తర్వాతే ఏం జరిగిందో తర్వాతి ఎపిసోడ్‌లో చూడండి.