కూతురు వేద బాధకు కారణమేంటో అడుగుతుంది సులోచన. అన్ని విధాల ధైర్యం చెప్పి నేనున్నానంటూ భరోసానిస్తుంది. మరోవైపు అభిమన్యు మాళవికను రెచ్చగొడతాడు. ఎలాగైనా వేద, యశ్‌లను ఫినిష్ చేయాలని చెప్తాడు. అదే సమయంలో మాళవిక దగ్గరికి వెళ్తుంది సులోచన. ఆ తర్వాత అక్టోబర్ 6 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
తన కూతురు జోలికి రావద్దని మాళవికను హెచ్చరిస్తుంది సులోచన. తన కూతురు గొప్పదనం చెప్పి.. మాళవికకు విలువలేదంటూ చెడామడా వాయిస్తుంది. తన గతాన్ని గుర్తు చేస్తూ.. హేళన చేస్తుంది. మధ్యలో వెళ్లిన అభిమన్యుకు కూడా వార్నింగ్ ఇస్తుంది. అంతేకాకుండా కైలాష్‌కి కూడా గట్టిగానే క్లాస్ పీకుతుంది. నేను నా కూతురు అంత మంచిదాన్ని కాదని చెప్తుంది. ఇంటికి వెళ్తున్న సులోచన.. మాళవిక ఇక తన కూతురు జోలికి రాదు అనుకుంటుంది. జరిగిందంతా వేదకు చెప్పేందుకు ఫోన్ చేస్తుంది కానీ.. వేద ఫోన్ లిఫ్ట్ చేయదు. అంతలోనే సులోచన ఆటో కోసం వెతుకుతుండగా వెనకాల నుంచి కారు వచ్చి ఢీ కొడుతుంది. అపుడే అటుగా వెళ్తున్న యశోదర్ తన అత్తయ్యని అలా చూసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్లు సులోచనని ఐసీయూలో అడ్మిట్ చేస్తారు. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు కానీ తనని బతికించమని వేడుకుంటాడు యశ్.
ఆ తర్వాత సులోచనకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తారు. యశ్ తన భార్య వేదకు ఫోన్ చేసి ‘మీ అమ్మకు ఆక్సిడెంట్ అయింది’ అని చెప్తాడు. నువ్ వెంటనే బయల్దేరి వచ్చేయి. మామయ్యకు చెప్పకు. కంగారు పడతాడు అంటాడు యశ్. వేద కంగారుపడుతూ అమ్మకి ఎలా ఉంది.. ఏమైంది అంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత వేద హాస్పిటల్‌లో ఉన్న యశోదర్ దగ్గర కనిపిస్తుంది. భర్త షర్ట్‌కి అంటుకున్న రక్తం మరకలను చూసి ‘అమ్మకి ఏమైంది’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఐసీయూలో ఉన్నతల్లిని చూసి ఏడుస్తుంది. తనకేం కాదని చెప్పి ఓదారుస్తాడు యశ్. మా అమ్మని ఎలాగైనా కాపాడండి అంటూ వేడుకుంటుంది వేద భర్తని.
ఆ తర్వాత సీన్‌లో వేద అక్క, బావ అందరూ హాస్పిటల్‌కి వస్తారు. సులోచన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. ఆక్సిడెంట్ ఎలా జరిగిందని అడగ్గా.. జరిగిందంతా చెప్తాడు యశ్. ఏడుస్తున్న వేదతో నువ్ ఒక డాక్టర్‌వి.. అలా ఏడిస్తే ఎలా అంటాడు యశ్. నాన్నకు ఏం చెప్పాలి అంటూ ఆందోళన పడుతుంది వేద. అంతలోనే వేద తండ్రి వస్తాడు ఆస్పత్రికి. ఏమైంది అని అడగ్గా.. అందరూ ఏం లేదంటూ నిజం దాచిపెడతారు. ‘మామయ్య.. నాకు ఒక ప్రామిస్ చేయండి. నేను చెప్పేది విని మీరు అప్‌సెట్ కావద్దు’ అని అంటాడు. అత్తయ్యగారికి ఆక్సిడెంట్ అయిందని చెప్పిన వెంటనే కుప్పకూలిపోతాడు అతడు. తనకేం కాలేదని.. తలకి దెబ్బ తగిలిందని, ఆపరేషన్ జరుగుతుందని చెప్పి ఓదారుస్తాడు యశ్ మామయ్యని. అత్తయ్యకు ఏం కాదంటూ హామీ ఇస్తాడు. పెద్దవారు మీరే వేదని ఓదార్చాలి.. అందరికీ ధైర్యం చెప్పాలి అంటాడు. కూతుర్ని దగ్గరికి తీసి మీ అమ్మకి ఏం కాదంటూ చేరదీస్తాడు.
అపుడే వేద అత్తయ్య, మామయ్యలు వస్తారు హాస్పిటల్‌కు. మీ అమ్మ చేసిన పూజలే తనని కాపాడతాయని చెప్తుంది కోడలికి. అంతలోనే అక్కడికి వస్తుంది డాక్టర్. ‘మా అమ్మ ఎలా ఉందంటూ అడుగుతుంది’ వేద. ‘మా ప్రయత్నం మేం చేశాం. తలకు బలమైన గాయం కావడం వల్ల తన బ్రెయిన్ షాక్‌కు గురైంది. 24 గంటల్లోగా ఆమె స్పృహలోకి రావాలి లేకపోతే ఏం చేప్పలేం’ అంటుంది డాక్టర్. అది విని అందరూ కంటతడి పెడతారు. మరి సులోచన కోలుకుంటుందో లేదో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..