Mouni Roy : బ్రహ్మాస్త్ర బ్యూటీ మౌనీ రాయ్ తన స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ విఫలం కాదు. లేటెస్ట్‌గా ట్రాన్స్ పరెంట్ తెలుపు చీర కట్టుకుని పూర్తిస్థాయిలో ఫెస్టివ్ వైబ్స్ తీసుకువచ్చింది ఈ బ్యూటీ. ఫ్యాషన్ డిజైనర్ గోపి వయిద్ డిజైన్ చేసిన కలెక్షన్స్ నుంచి షీర్ వైట్ చీరను ఎన్నుకుంది మౌనీ రాయ్. ఈ సంప్రదాయ చీరకట్టుకు మరింత వన్నె తెచ్చేందుకు మౌనీ రాయ్ స్టేట్‌మెంట్ జ్యువెల్లరీని ధరించి అందరిని మంత్రముగ్ధులను చేసింది.

Mouni Roy : బాలీవుడ్ నటి మౌనీ రాయ్ తన లేటెస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ చిత్రంలో తన పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడటంతో ఆనందంలో మునిగిపోయింది మౌనీ రాయ్. తాజాగా తన భర్తతో కలిసి మాల్దీవుల్లో హాలిడే వెకేషన్‌ను ముగించుకుని ఇంటికి చేరుకున్న మౌనీ రాయ్ దసరా నవరాత్రి వేడుకల్లో మునిగిపోయింది.

దసరా పండుగ సందర్భంగా దుర్గా పూజ కోసం కో స్టార్ రణ్‌బీర్ కపూర్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీతో కలిసి మండపానికి వెళ్లిన మౌనీ రాయ్ తెలుపు రంగు చీరలో తారలా మెరిసిపోయింది. తెల్ల చీర, మెడలో భారీ నెక్‌లెస్ పెట్టుకుని మౌనీ ఎంతో గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది.

మోడ్రన్ అవుట్‌ఫిట్స్ ధరించి అందరిని కవ్వించడమే కాదు సొగసైన చీరకట్టుతోనూ చంపేస్తుంది మౌనీ రాయ్. మౌనీకి చీరలతో అనుబంధం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ నటి తన అద్భుతమైన ఎంపికలతో అందరి చూపును తనవైపు తిప్పుకోవడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ మౌనీని శారీ గర్ల్ అని పిలుస్తారు.

తాజగా పోస్ట్ చేసిన ట్రాన్స్ పరెంట్ చీరలోనూ దేవకన్యలా కనిపించింది మౌనీ రాయ్. చీర మొత్తం గోల్డెన్ వర్క తో డిజైన్ చేశారు డిజైనర్. ఈ శారీకి జోడీగా స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని మినిమల్ మేకప్‌తో ట్రెండీ లుక్‌లో కనిపించి అందరిని మెస్మరైజ్ చేసింది మౌనీ.

గతంలోనూ డార్క్ గ్రీన్ కలర్ ట్రాన్సపరెంట్ ప్లెయిన్ చీర కట్టుకుని తన నాభి అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ల మనసు దోచేసింది మౌనీ రాయ్. స్లీవ్ లెస్ , డీప్ నెక్‌లైన్‌తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని అదరగొట్టింది అందాల భామ.

చెవులకు భారీ కుందన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని స్టన్నింగ్ లుక్స్‌తో యూత్‌ను టెంప్ట్ చేసింది. ఈ చీరతో దిగిన పిక్స్ కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.

అంతకు ముందు డార్క్ రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ చీర కట్టుకుని హాట్ లుక్స్‌తో అందరిని కట్టిపడేసింది ఈ బ్యూటీ. చీరంతా ప్లెయిన్‌గా బార్డర్ లో ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చిన ఈ చీరలో అమ్మడి అందాలు రెట్టింపయ్యాయి.

ఈ చీరకు జోడీగా ఫుల్ స్లీవ్స్ ఎంబ్రాయిడరీతో స్వీట్ హార్ట్ నెక్‌లైన్‌తో వచ్చిన డిజైనర్ బ్లౌజ్ ను వేసుకుంది.తన లుక్‌తో ట్రెడిషనల్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది.
