Ileana D’cruz : నటి ఇలియానా డీక్రూజ్ అద్భుతమైన ఫ్యాషన్‌స్టార్. ఆమె సొగసులను ప్రదర్శిస్తూ ధరించే ప్రతి అవుట్‌ఫిట్ స్టైల్ రాడార్‌లో అగ్ర భాగాన నిలుస్తాయి. ఇక బీచ్‌వేర్ విషయానికి వస్తే అమ్మడి ఫ్యాషన్ స్టైల్స్ అమోఘంగా ఉంటాయని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు ఫ్యాషన్ ప్రియులు . ఈ భామ ఛాన్స్ దొరికినప్పుడల్లా బికినీలు ధరించి కుర్రాళ్లను బెంబేలెత్తిస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన చాలా వరకు ఫోటోల్లో బికినీలతో ఇలియానా దర్శనమిస్తుండటంతో ఫ్యాన్స్ ఇలియానాను వాటర్ బేబీగా కూడా ముద్దుగా పిలుస్తుంటారు. తాజాగా పోస్ట్ చేసిన హాట్ ఎల్లో కలర్ బికినీలోనూ కుర్రాళ్లకు కైపెక్కిస్తోంది ఇలియానా.

అవకాశం దొరికనప్పుడల్లా హాలిడే వెకేషన్స్ కోసం ఇలియానా బీచ్‌లకు పారిపోతుంటుంది. ప్రస్తుతం ఇలియానా ఎక్కడుందని ఆశ్చర్యపోతున్నారా, అవును మీరు ఊహించింది నిజమే.. ప్రస్తుతం ఈ బ్యూటీ గోవాలో ఎంజాయ్ చేస్తోంది. గోవాలో తన లొకేషన్ గురించి అభిమానులకు అప్‌డేట్ చేస్తూ ఇలియానా పసుపు రంగు బికినీ ధరించి చేసిన అద్భుతమైన హాట్ ఫోటో షూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

త్రిభుజాకారంలో వచ్చిన బికినీ టాప్ మెడ వెనుకన దారాలతో కట్టి ఉంది. సైడ్ భాగం లో నాట్ డీటైల్స్‌తో వచ్చిన బాటమ్ ధరించింది. బికినీ తో పాటు పాదాలకు వైట్ స్ట్రాప్స్‌తో వచ్చిన బ్లాక్ స్లిప్పర్స్ వేసుకుంది. ఇలియానా మినిమల్ మేకప్ వేసుకుని బికినీలో తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు చెమటలు తెప్పించింది.

ఇలియానా ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ ని ఒకసారి గమనిస్తే బీచ్‌వేర్ వార్డ్‌రోబ్ ట్రెండ్స్‌ను ఎవ్వరైనా ఫాలో అయిపోవచ్చు. గతంలోనూ బీచ్ వెకేషన్ కు వెళ్లిన ఇలియానా అందమైన చిత్రాలను ఫాలోవర్స్‌తో పంచుకుంది. ముందు భాగంలో టై నాట్ వివరాలతో వచ్చిన స్ట్రాప్‌లెస్ పర్పుల్ కలర్ బికినీ లో ఇలియానా ఎప్పటిలాగే చాలా హాట్‌గా కనిపించింది. ఈ బికినీకి సరిగ్గా నప్పే విధంగా అదే రంగులో వచ్చిన ష్రగ్ వేసుకుంది. చెవులకు సిల్వర్ కలర్ హూప్ ఇయర్‌రింగ్స్ చేతికి సిల్వర్ గాజులు వేసుకుని బీచ్ ఫ్యాషన్‌ను ప్రమోట్ చేసింది.

అంతకు ముందు మరో ట్రయాంగిల్ బికినీ వేసుకుని సెక్సీ లుక్స్‌తో కుర్రాళ్లకు కునుకులేకుండా చేసింది ఇలియానా బేబీ. రాయల్ బ్లూ వెల్వెట్ బికినీతో అందరి మైండ్ బ్లాక్ చేసింది.

ఇలియానా బీచ్‌వేర్ కలెక్షన్స్ అందరిని ఇట్టే ఆకట్టుకుంటాయి. బీచ్ వెకేషన్‌కు వెళ్లిన ప్రతిసారి సరికొత్త బికినీలతో ఫ్యాషన్ ప్రియులను అలరిస్తుంటుంది. రీసెంట్‌గా ఓ బీచ్ వెకేషన్‌కు వెళ్లిన ఈ భామ వైట్ కలర్ బ్రాలెట్ మ్యాచింగ్ బాటమ్ వేసుకుని స్వర్గలోకానికి తీసుకెళ్లింది.

ఆ మధ్యన బ్రైట్ కలర్ రెడ్ బికినీ వేసుకుని కుర్రాళ్ల గుండెల్లో వేడి పుట్టించింది ఇలియానా. రఫెల్డ్ యాక్సెంట్, రిబ్బెడ్ ఫినిషింగ్ తో వచ్చిన టాప్, హై వెయిస్ట్ బాటమ్స్ లో కలర్‌ఫుల్ గా కనిపించి కవ్వించింది.