Health Benefits: కాకరకాయ రుచికి చేదు అయినప్పటికీ మన ఆరోగ్యాన్ని రక్షించడంలో అమృతంలా పనిచేస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా కాకరకాయలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు,యాంటీ వైరల్ గుణాలు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొని శరీరానికి అవసరమైన వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే మన శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన ఐరన్, మెగ్నీషియం, జింక్, పొటాషియం, కాల్షియం వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి.
కాకరకాయ మన నిండు జీవితానికి సరిపడా పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. కావున ప్రతిరోజు కాకరకాయను కర్రీ ,తాలింపు, చిప్స్, జ్యూస్ ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.వర్షాకాలంలో కాకరకాయను కేవలం కూర రూపంలోనే కాకుండా జ్యూస్ రూపంలో వారానికి ఒకసారి తీసుకుంటే సీజనల్గా వచ్చి వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనడంతో పాటు కాకరకాయలో ఉండే హైపోగ్లసమిక్ పదార్ధము రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని నియంత్రించి మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.
కాకరకాయలో తక్కువ కెలొరీలూ,ఎక్కువ కార్బొహైడ్రేట్లూ,పీచూ పదార్థం పుష్కలంగా ఉండడంతో జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధకం, ఉదర సంబంధిత క్యాన్సర్లను నిర్మూలిస్తుంది. రక్తాన్ని శుద్ధిపరిచి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి భవిష్యత్తులో వచ్చే గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
Health Benefits: క్యాన్సర్ కారకాలను నశింప చేస్తుంది..
కాకర గింజలలలో చారన్‌టిన్ అనే పదార్థం శరీరంలోని మలినాలను తొలగించడమే కాకుండా కాలేయ పనితీరును మెరుగుపరిచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. కాకరకాయలో విటమిన్ బి1, విటమిన్ బి2, విటమన్ బి3, థైయమిన్, క్యాల్సియం, బీట కేరొటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలోని క్యాన్సర్ కారకాలను నశింపజేసి అనేక క్యాన్సర్ల నుంచి మనల్ని కాపాడుతుంది. ఇంతటి ఔషధ గుణాలున్న కాకరకాయను మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోకండి.