Health Tips: మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు ఆపిల్ పండ్లలో పుష్కలంగా ఉన్నాయని అనేక అధ్యయనాల్లో పేర్కొనడం జరిగింది. అయితే ఆపిల్ పండ్లను బ్రేక్ ఫాస్ట్ కు ముందే ఆహారంగా తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చుననీ వైద్యులు సూచిస్తున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ పండ్లలో మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ ,సి ,డి, కే, బి1, బి6, బి9, మినరల్స్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్, సోడియం, ఇనుము మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. కావున ఆపిల్ పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే యాపిల్ లోని అన్ని పోషకాలను మన శరీరం సులభంగా గ్రహిస్తుంది. కావున మన నిత్య జీవక్రియలకు అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
మన శరీరానికి తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఆపిల్ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. కావున ఆపిల్ పండ్లను ప్రతిరోజు ఖాళీ కడుపుతో తింటే మన శరీరం కార్బోహైడ్రేట్స్ ను సక్రమంగా వినియోగించుకొని రోజంతా అలసిపోకుండా చురుగ్గా ఉండేటట్లు ఉంచుతుంది.ఆపిల్ పండ్లలో పొటాషియం ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నివారించి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడి భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కావున ప్రతిరోజు ఉదయాన్నే తాజా ఆపిల్ పండును తినడం ఉత్తమం.
Health Tips: శరీర బరువు తగ్గుదలకు దోహదపడుతుంది
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయాన్నే ఆపిల్ పండు తినడం వల్ల ఇందులో ఉండే పీచు పదార్థాలు త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. తద్వారా ఆహారం తక్కువగా తీసుకొని సులభంగా బరువు తగ్గవచ్చు.
ఆపిల్ పండ్లలో ఎముకలను బలంగా చేసే కాల్షియం పుష్కలంగా ఉంటుంది.యాపిల్ తొక్కలో ఫ్లేవనాయిడ్ క్వెర్సెటిన్ ఉంటుంది ఇది శరీరంపై వాపు ,మంటలు తగ్గుతాయి. కాబట్టి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న యాపిల్ పండును ప్రతిరోజు ఖాళీ కడుపుతో తినడం మంచిది.