5G Mobiles: ఈ 5G మొబైల్స్ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్, బెస్ట్ కనెక్టివిటీని అందిస్తున్న టాప్ బ్రాండ్లు. ఈ సంవత్సరంలోనే 5జీ మొబైల్స్ అందుబాటులోకి రానుంది. దాని వల్ల ఎక్కువ కంపెనీలు తక్కువ ధరలోనే 5G మోడల్స్ లను అందిస్తున్నాయి.
మీరు రూ.20 వేలలో బెస్ట్ మొబైల్స్ కోసం చూస్తుంటే ఈ 5G మొబైల్స్ ను ఒకసారి పరిశీలించండి.
POCO X4 ప్రో :
మాములుగా పోకో X4 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర రూ.18,999. ఇది 6GB RAM, 64 GB స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. 5000 mAh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ, 6.67-అంగుళాల పుల్ HD+ సూపర్ అమోలేడ్ డిస్ప్లేతో చూడటానికి చాలా ఎట్రాక్టివ్‌గా కనిపిస్తోంది.
Realme X7 5G :
రియల్మీ X7 స్మార్ట్‌ఫోన్ అనేది 6.4 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.వీటిలో మీడియాటెక్ డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్ ఉంటుంది. అంతేకాకుండా 64 + 8 + 2 + 2 MP రియర్ కెమెరా సెటప్, 32 MP ఫ్రంట్ కెమెరా సెటప్‌ని కలిగి ఉండటం ఈ ఫోన్ యొక్క ప్రత్యేకతలు.
iQOO Z6 5G :
5G స్మార్ట్ఫోన్లలో iQOO Z6 5G స్మార్ట్‌ఫోన్ అనేది మార్కెట్లో చాలా తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఐక్యూ Z6 5G ఫోన్ 6.58-అంగుళాల అమోలేడ్ ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వచ్చే ఈ డివైజ్,ఇవి మూడు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. యూజర్లు 4GB + 128GB, 6GB + 128GB లేదా 8GB + 128GB వేరియంట్లను కుడా ఎంచుకోవచ్చు.
Oppo A74 5G :
ఈ స్మార్ట్‌ఫోన్ 6 GB RAM, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 480 5G CPU, 48 + 8 + 2 MP రియర్ కెమెరా సెటప్, 8 MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ వంటి ఫ్యూచర్లను కలిగి ఉంటుంది.
5G Mobiles:
Samsung Galaxy M33 5G :
శామ్సంగ్ గెలాక్సీ M33 5G ఫోన్లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది 6.6-అంగుళాల TFT డిస్ప్లే, Exynos 1280 చిప్సెట్ వంటివి ఈ ఫోన్ యొక్క ఫ్యూచర్లు. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128 GB స్టోరేజ్.. 8GB RAM, 128 GB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది.