దుర్గాష్టమి సందర్భంగా నయని కుటుంబసభ్యులంతా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ధర్మానికి నిజమైన అర్థమేంటో చెప్పి అందరి మన్ననలు పొందుతుంది నయని. మరోవైపు అత్త తిలోత్తమ.. నయనికి సుహాసిని పూజ చేస్తుంది. కోడలు పాదాలు కడిగి.. అలంకరిస్తుంది. అదే సమయంలో గాయత్రిని తాకిన తిలోత్తమకు షాక్ కొడుతుంది. దాంతో ఒక్కసారిగా కేకలు పెడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 5 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
తిలోత్తమ అరుపుకు కారణమేంటని అడుగుతారు కొడుకు, కోడలు. ‘నన్ను చంపడానికి వచ్చింది రా మీ పెద్దమ్మ’ అంటుంది. అమ్మవారి పూజ తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి అక్కడే పడుకోబెడుతుంది నయని. హాసినితో తన కొడుకును కూడా తీసుకురమ్మని చెప్తారు. ఆ తర్వాత అందరూ ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. పాప కుడిచేతిని తాకినపుడు తనకు కరెంట్ షాక్ కొట్టిందని తిలోత్తమ చెబుతుంది. అక్కడే ఉంటే భయంతో అఘోరాలు కలిసిన విషయం చెప్పేస్తానేమోనని వచ్చేశాను అంటుంది. మళ్లీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని చెబుతాడు తల్లితో. సరే చెక్ చేద్దాం పదండి అంటూ వెళ్తారు అందరూ. విష్‌కు ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అమ్మవారి ముందు పడుకోబెట్టిన పాపని చేతిని తాకుతుంది తిలోత్తమ. దేవుడి ముందు ఉన్న తమలపాకు నూనె దానికి ముందే పాప చేతికి అంటుకుంటుంది. దాంతో పాప చేతిని తాకినా కూడా తిలోత్తమకు షాక్ రాదు. కానీ కిందపడిపోతుంది. కాలుజారిందని చెప్తుంది కోడలు. వెళ్లిన వారు మళ్లీ ఎందుకు వచ్చారని అడగ్గా.. అపుడు ప్రసాదం తీసుకోలే కదా అందుకే వచ్చిందని కవర్ చేస్తాడు వల్లభ. దాంతో విశాల్ తల్లికి ప్రసాదం తినిపిస్తాడు. తిలోత్తమని లోపలికి తీసుకెళ్లి వేడి కాపడం పెట్టమని చెప్తారు కొడుకు, కోడలు.
పిల్లలిద్దరికీ పాలు పట్టమని చెప్తాడు విశాల్ నయనితో. తల్లి, కూతుల్లు ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నంటున్నారు అంటాడు భర్త. గట్టిగా అనకండి సుమన వింటే పరుగెత్తుకొస్తుంది అంటుంది నయని. సుమన వచ్చే లోపు మీ ఇద్దరికీ దిష్టీ తీసేస్తా అంటాడు విష్. ఎడమ చేతితో గానవికి దిష్టి తీయమని చెప్తుంది నయని. అందరి దిష్టి పోవాలంటూ పేరు పేరున దిష్టి తీసేస్తాడు విశాల్. ‘అలాగే ఉండండి. అమ్మా, కూతుళ్ల కాళ్లకి దిష్టి చుక్క పెడతా’ అంటాడు విష్. చూశావా గానవి.. నిన్ను కాళ్ల మీద వేసుకున్నా మీ అమ్మకి చెక్కిలి గింతలు అవుతున్నాయట అంటాడు సరదాగా.
సీన్ కట్ చేస్తే.. ‘నా వల్ల కావట్లేదు వల్లభ. అన్ని క్రీమ్స్ వాడానను కానీ ఆంటీ నడుం నొప్పి తగ్గట్లేదు అని చెప్తుంది కసి. నేను కూడా ట్రైచేస్తా మమ్మీ అంటాడు వల్లభ. ఎవరూ ఏం చేయకండి. అమ్మవారి ముందు పాపని తాకాలనుకోవడం నాదే తప్పు అంటుంది తిలోత్తమ. ‘పాప గాయత్రీ ఆంటి కాదని ప్రూఫ్ అయింది కదా’ అంటుంది కసి. మళ్లీ టచ్ చేయమంటారా? అంటుంది తిలోత్తమ. వద్దులే మమ్మీ పాప మన శత్రువు కాదని తెలిసిపోయింది కదా అంటాడు వల్లభ. చిన్న పిల్లల కాళ్లు పట్టుకున్నా తప్పు లేదు కసి అంటాడు భార్యతో. మొన్న చేయి కాలింది తర్వాత సంపూర్ణంగా ఆహుతి చేసేస్తోంది అని భయపడుతుంది తిలోత్తమ. రేపటినుంచి ఆ పిల్లని భూతద్దంలో వెతుకుతాం మమ్మీ అని మాటిస్తాడు వల్లభ.
నయని మళ్లీ ఎవరి మీద కంప్లైంట్ రాస్తున్నావ్.. అంటాడు భార్యని. మీ మీదే రాస్తున్నా అంటుంది సరదాగా. ఏమని రాస్తున్నావ్ అని అడగ్గా.. నా బిడ్డల తండ్రిగా పిల్లల్ని ఆడించకుండా మీటింగులు అంటూ పిల్లల్ని పట్టించుకోవట్లేదని కంప్లైంట్ ఇస్తున్నట్టు చెప్తుంది నయని. పిల్లలకు ఏం పేరు పెట్టాలనకుంటున్నావ్ చెల్లి అని నయని అడగ్గా.. నేను ఫిక్స్ చేసుకున్నా అని చెప్తాడు మరిది. ఆ తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..