Bigg boss 6: బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఓటింగ్ చూస్తే అవాక్కవడం ఖాయం. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఇంత దరిద్రంగా ఓటింగ్ లేదంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈసారి బిగ్‌బాస్ సీజన్ 6 కూడా అంతే ఉందనుకోండి. ఎంటర్‌టైన్‌మెంట్ లేదు.. ఏమీ లేదు. చూస్తే చిరాకు.. ఆపై బీపీ పెరగడం ఖాయం. అందుకేనేమో చూడటమే మానేశారు. దీంతో రేటింగ్ ఢమాల్. దీన్ని లేపేందుకు నిర్వాహకులు నానా తంటాలు పడుతున్నారు. అయినా సరే.. లేస్తేగా..
ఇక ఈవారం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో అసలు సిసలైన కంటెస్టెంట్ రేవంత్ లేడు. దీంతో ఓటేయడానికి జనం ఇంట్రస్ట్ కూడా చూపడం లేదు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. డేంజర్ జోన్‌లో చాలా ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒక్కసారి ఇప్పటి వరకూ జరిగిన ఓటింగ్‌ను పరిశీలిస్తే.. ఇనయ టాప్‌లో అంటే కేవలం 14 శాతంతో కొనసాగుతోంది. తరువాత 13 శాతంతో ఆదిరెడ్డి, ఫైమా, అర్జున్, వాసంతి ఉన్నారు. ఆదిరెడ్డి, ఫైమాతో అర్జున్, వాసంతిలకు సమానంగా ఓటింగ్ రావడమే ఆసక్తికరం.
ఇక ఆ తరువాత మెరీనా 12 శాతం ఓటింగ్‌తో 3వ స్థానంలో ఉంది. అయితే గతంలో మెరీనాకు ఓటింగ్ బాగానే ఉంది కానీ ఈసారి బాగా పడిపోయింది. ఇక చంటి, బాలాదిత్య లీస్ట్‌లో ఉన్నారు. వీళ్లిద్దరూ పాయింట్స్ తేడాతోనే ఉన్నారు. అయితే వీరంతా ఏవో పాయింట్స్ తేడాతో చాలా దగ్గర దగ్గరగా ఉన్నారు. ఎవరు వెళ్లిపోతారనేది చాలా సస్పెన్స్‌గా మారింది. ముందుగా చంటి, బాలాదిత్యలను ఇంత లీస్ట్‌లో చూస్తామని ఎవరూ ఊహించి ఉండరు. వీరిద్దరికీ బయట నెగిటివిటీ కూడా పెద్దగా లేదు. అయినా మిగిలిన వాళ్లకంటే వీరు లీస్ట్‌లో ఉండటం ఆసక్తికరంగా మారింది.