కళ్యాణ్ రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా బింబిసార సినిమా నిలిచింది అని చెప్పాలి. రెండు భిన్నమైన నేపధ్యాలని టైం ట్రావెల్ అంశంతో కనెక్ట్ చేసి ప్రేక్షకులని కన్విన్స్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. దర్శకుడికి మొదటి సినిమా అయినా కూడా ఎక్కడా తడబాటు లేకుండా కళ్యాణ్ రామ్ ఇచ్చిన సపోర్ట్ తో భారీ బడ్జెట్ సబ్జెక్ట్ ని ఈజీగా హ్యాండిల్ చేశాడు. వశిష్ఠ మల్లిడి ఈ మూవీతో ఏకంగా పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. ఇక ఆయన జాబితాలో ఇప్పుడు బింబిసార సీక్వెల్ ప్లాన్ ఒకటి, అలాగే తారక్ తో ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా లాంగ్ రన్ లో సిల్వర్ స్క్రీన్ పై ఏకంగా 75 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఓటీటీ, శాటిలైట్ రైట్స్ తో కలుపుకుంటే బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ ఏకంగా వంద కోట్ల కలెక్షన్ క్లబ్ లో చేరిపోయాడు. కేవలం సౌత్ భాషలలోనే రిలీజ్ అయిన కూడా భారీ కలెక్షన్స్ ని మూవీ సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 సంస్థ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు. అక్టోబర్ 21 నుంచి గ్రాండ్ ప్రీమియర్ గా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది అని ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. మరి ఓటీటీవైపు దృష్టిపెట్టిన ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాపై ఏ స్థాయిలో ఆసక్తి చూపిస్తారు అనేది ఇప్పుడు చూడాలి.