అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 మూవీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం అవుతుంది. రష్మిక మందన ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా కీలకమైన పాత్రలోనే కొనసాగుతుంది. ఫాహద్ ఫాజిల్ ఈ సీక్వెల్ లో మెయిన్ విలన్ అనే సంగతి అందరికి తెలిసిందే. అలాగే మొదటి పార్ట్ లో ఉన్న నటీనటులు అందరూ కూడా రెండో భాగంలో కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.
అలాగే బాలీవుడ్ హీరో ఈ మూవీలో విలన్ గా కనిపించబోతున్నాడు అనే టాక్ బయటకి వచ్చింది. అయితే ఆ హీరో ఎవరనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిటౌన్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పుష్ప 2 లో బాలీవుడ్ యంగ్ స్టార్ అర్జున్ కపూర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు అని. అయితే అది ఏ పాత్ర అనేది మాత్రం తెలియరాలేదు అని చర్చ నడుస్తుంది. అయితే అతను పోషించేది మెయిన్ విలన్ రోల్ అని గ్యాంగ్ స్థార్ తరహాలో అతని పాత్ర ఉండబోతుందని అని టాక్.
ఈ గ్యాంగ్ స్టార్ రోల్ పుష్ప పార్ట్ 3కి కొనసాగింపుగా ఈ సీక్వెల్ లో సుకుమార్ పెట్టనున్నాడని టాక్. ఎలాగూ పుష్ప సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ నేపధ్యంలో పార్ట్ 2 మీద అక్కడ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో పార్ట్ 3 కూడా ప్లాన్ చేయడానికి కావాల్సినంత స్కోప్ కంటెంట్ లో ఉందని సుకుమార్ భావించడంతో అలా బాలీవుడ్ హీరో అయిన అర్జున్ కపూర్ ని సినిమా కోసం ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది నిర్మాతలు తెలియజేస్తే కానీ కన్ఫర్మ్ కాదు.