మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ గా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్ర గాడ్ ఫాదర్. భారీ అంచనాల మధ్య ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మొదటి ఆటతో మెగా ఫ్యాన్స్ సందడి మొదలైంది. అలాగే యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ లో మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు వాళ్ళు అందరూ సినిమాని చూసేశారు. హిందీలో కూడా సల్మాన్ ఖాన్ నటించడంతో హైప్ ఏర్పడింది. అక్కడి ప్రేక్షకులు కూడా గాడ్ ఫాదర్ సినిమాపై మక్కువ చూపిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే.
కథ : ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత ఆయన వారుసుడుగా మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోవాలి అనే విషయం మీద రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది. ఆ స్థానంలో సత్యప్రియ జయదేవ్ ని కోర్చోబెట్టాలని భావిస్తూ ఉంటారు. అలాగే పార్టీలో ఉన్న కొంత మంది ముఖ్యమంత్రి పీఠం కోసం పావులు కదుపుతూ ఉంటారు. సత్యప్రియని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి రాష్ట్రంలో పెత్తనం మొత్తం తన చేతిలోకి తీసుకోవాలని జయదేవ్ భావిస్తూ ఉంటాడు. అప్పుడే రంగంలోకి బ్రహ్మ ఎంట్రీ ఇస్తాడు. చాలా కాలం పాటు కనిపించకుండా పోయిన బ్రహ్మ ఉన్నపళంగా మళ్ళీ రాష్ట్రంలోకి అడుగుపెడతాడు. అక్కడి నుంచి రాజకీయాలలో చక్రం తిప్పుతూ ఉంటారు. సరైన నాయకుడిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే బాద్యతని తీసుకుంటాడు. అయితే బ్రహ్మకి ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి?, గాడ్ ఫాదర్ కనిపించకుండా పోయిన తర్వాత ఏమయ్యాడు? మళ్ళీ ఎందుకు రాష్ట్రంలో అడుగుపెట్టాల్సి వచ్చింది? అసలు సల్మాన్ ఖాన్ కి గాడ్ ఫాదర్ కి సంబంధం ఏంటి అనే అంశాలతో ఈ సినిమా కథనం ఉంటుంది. అందరికి తెలిసిన లూసీఫర్ సినిమానే కావడంతో దానికంటే కొత్త అంశాలు సినిమాలు ఎం ఉన్నాయనే ఆసక్తి ఏర్పడుతుంది. ఇక మాతృకని మింది మెగాస్టార్ ఈ మూవీ సక్సెస్ అందుకున్నాడా అంటే అవుననే చెప్పాలి.
క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే బ్రహ్మ పాత్రలో రాజకీయాలని శాసించే గాడ్ ఫాదర్ గా చిరంజీవి సినిమా ఆరంభంలో కొంత పొలిటికల్ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే స్క్రీన్ మీదకి వస్తాడు. ఇక చిరంజీవి ఎంట్రీ సీన్ కి ఆడియన్స్ నుంచి విజిల్స్ పడతాయి. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆ రేంజ్ లో బ్రహ్మ ఎలివేషన్ కి హెల్ప్ అయ్యింది. చిరంజీవి వన్ మెన్ ఆర్మీ తరహాలో తన పాత్రని చాలా సునాయాసంగా చేసుకొని వెళ్ళిపోయాడు. కెరియర్ లో మొదటిసారిగా ఓ గ్యాంగ్ స్టార్ గా అలాగే పొలిటికల్ కీ మేకర్ గా భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఇక నయనతార కూడా షెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. రాజకీయాలపై ఆసక్తి లేకపోయిన తండ్రి ఆశయాల కోసం నిలబడే వ్యక్తిగా, గాడ్ ఫాదర్ ని ద్వేషించే వ్యక్తిగా కనిపిస్తుంది. ఇక పవర్ ఫుల్ విలన్ పాత్రలో సత్యదేవ్ తన అద్భుతమైన ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ తో ఎక్కువ మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. చిరంజీవి, సత్యదేవ్ మధ్య వచ్చే సన్నివేశాలకి ప్రేక్షకులకి విజిల్స్ పడతాయి. పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు, తమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గాడ్ ఫాదర్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్లాయి. ఓవరాల్ గా సినిమాకి పాజిటివ్ టాక్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. ఇక సల్మాన్ ఖాన్ కనిపించేది కొద్దిసేపే అయిన పవర్ ఫుల్ పాత్రలో మెస్మరైజ్ చేశాడు. తెలుగులో చిరంజీవికి ఏ మాత్రం తీసిపోని పాత్రలో ఎంట్రీ ఇచ్చి మెప్పించాడు. అయితే కొన్ని చోట్ల అతని పెర్ఫార్మెన్స్ ఓవర్ గా ఉంటున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని సల్మాన్ ఖాన్ ని ఈ సినిమా కోసం తీసుకున్నట్లు అర్ధమవుతుంది.
ఓవరాల్ గా మెగాస్టార్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాంటి పవర్ ఫుల్ పాత్రతో విజిల్స్ వేయించే ఎపిసోడ్స్ తో, ఇంటెన్సివ్ డైలాగ్స్ తో, సత్యదేవ్ పవర్ ఫుల్ విలనిజంతో, తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా మాసివ్ పొలిటికల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులకి చేరువ అవుతుందని చెప్పొచ్చు. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఆచార్య లాంటి ఫ్లాప్ తర్వాత ఫ్యాన్స్ కి బోస్ దసరా బోనాంజా ఈ సినిమాతో ఇచ్చారని చెప్పొచ్చు.