Vidya Balan : పండుగలు వచ్చాయంటే చాలు ముద్దుగుమ్మలందరూ చీరకట్టుతో మెస్మరైజ్ చేస్తుంటారు. స్టార్ సెలబ్రిటీలు ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. నవరాత్రుల్లో భాగంగా యువ హీరోయిన్‌ల నుంచి స్టార్ హీరోయిన్‌ల వరకు లెహెంగా సెట్స్, డిజైనర్ చీరలు కట్టుకుంటూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. తాజాగా డర్టీ పిక్చర్‌లో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన విద్యా బాలన్ ట్రెడిషనల్ లుక్‌తో అందిరిని ఆకట్టుకుంటోంది. ఆరు గజాల చీరను అందంగా కట్టుకుని పండుగ వైబ్స్‌ను తీసుకొచ్చింది విద్యాబాలన్

Vidya Balan : అద్బుతమైన చేనేత చీరలు , డిజైనర్ , స్టేట్‌మెంట్ చీరల సేకరణలో కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది బాలీవుడ్ నటి విద్యాబాలన్ . ఒక్కో చీరను ఒక్కోలా యూనిక్ స్టైల్ లో కట్టుకుని తన ప్రత్యేకతను చాటుకుంటుంది విద్యాబాలన్. ఈమె చీరకట్టుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతటి టాలెంట్ ఈ భామ సొంతం. తాజాగా ఓ ఫోటో షూట్ కోసం వంకాయ రంగులో ఉన్న అద్భుతమైన పట్టు చీరను కట్టుకుని దానికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని, మెడలో బంగారు ఆభరణాలను అలంకరించుకుని సంప్రదాయ కట్టుతో అందరి మనసును దోచేసింది విద్యా బాలన్. నవరాత్రి పండుగ సందర్భంగా దుర్గా పూజ కోసం సిద్ధమయ్యే వారికి, పెళ్లిల్లకు వెళ్లేవారికి అద్భుతమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇస్తోంది ఈ బాలీవుడ్ భామ. బొద్దుగా ఉన్నా ఈ చీరకట్టులో ఎంతో ముద్దుగా కనిపిస్తూ అందరిని అలరిస్తోంది.

సెలబ్రిటీ స్టైలిస్ట్స్ ప్రణయ్ జెట్లీ, షౌనక్ అమోన్‌కర్ విద్యాబాలన్ ట్రెడిషనల్ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వంగ రంగు పట్టుచీర కట్టుకుని ప్రకాశవంతమైన పసుపు రంగు బంతి పూల మధ్య విద్య ముద్దబంతిలా పోజులిచ్చిన పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ కింద దేవతలా ఉందంటూ క్యాప్షన్‌ను జోడించారు స్టైలిస్ట్స్ దీనిని అంగీకరిస్తున్నామని ఫాలోవర్స్ కామెంట్లు పోస్ట్ చేశారు.

ఈ అందమైన చీరను డిజైనర్ శిల్పా సెల్వరాజ్ క్లాతింగ్ లేబుల్ నుంచి సేకరించింది విద్యాబాలన్. వంగ రంగులో వచ్చిన ఈ పట్టు చీర అంచుల్లో టాసెల్ వర్క్ అలంకరణలు అందించారు డిజైనర్. వెండితో చేసిన క్లిష్టమైన బ్రోకేడ్ మోటిఫ్ ఎంబ్రాయిడరీని పల్లూకు అందించారు. ఈ చీరకు జోడీగా రౌండ్ నెక్‌లైన్ , బాడీ హగ్గింగ్ ఫిట్‌తో క్వార్టర్ లెన్త్ స్లీవ్స్ తో వచ్చిన బ్లౌజ్‌ను వేసుకుంది విద్యాబాలన్ .

ఈ ట్రెడిషనల్ లుక్‌కు మరింత స్టైలిష్ లుక్‌ను అద్దేందుకు హెవీ కుందన్స్‌తో డిజైన్ చేసిన ఎత్నిక్ గోల్డ్ టోన్డ్ నెక్‌లెస్‌ను మెడలో ధరించింది. దానికి మ్యాచింగ్ జుంకాలను చెవులకు పెట్టుకుంది. తన కురులతో మధ్యపాపిటి తీసి సిగ చుట్టుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని సంపూర్ణ మహిళగా కనిపించింది. ఇక తన అందానికి మరిన్ని మెరుగులు దిద్దింది విద్యా. నుదుటున పెద్ద బొట్టు పెట్టుకుంది. కనులకు బ్లాక్ ఐలైనర్, సబ్టిల్ ఐ ష్యాడో దిద్దుకుంది. పెదాలకు మావీ లిప్ షేడ్ వేసుకుంది. మెరిసేటి ఛర్మంతో తన లుక్‌ను మరింత గ్లామరస్‌గా మార్చుకుంది విద్యాబాలన్.
