పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం క్రిష్ గత నాలుగు రోజుల నుంచి ప్రీ షెడ్యూల్ వర్క్ షాపు నిర్వహించి సీన్స్ ప్రాక్టీస్ చేయించారు. ఈ వర్క్ షాపులో పవన్ కళ్యాణ్, హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు ఆర్టిస్ట్స్, టెక్నీకల్ టీమ్ అందరూ పాల్గొన్నారు. ఇక వర్క్ షాపు పూర్తయినట్లు తాజాగా క్రిష్ క్లారిటీ ఇచ్చారు. త్వరలో షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది.
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ని ఇప్పటికే క్రిష్ అనౌన్స్ చేసేశారు. గతంలో ఫెస్టివల్ కి సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ షూటింగ్ ఆలస్యం కావడంతో మళ్ళీ మార్చి 23కి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ దశలో సీజీ వర్క్ ఎక్కువగా ఉంటుందని ఈ నేపధ్యంలో మార్చి నాటికి సినిమాని రిలీజ్ చేయడం కష్టం అని క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగా మరో రెండు నెలలు ఆలస్యంగా మేలో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు టాక్.
అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా డిసైడ్ చేయకున్నా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూసుకొని కన్ఫర్మ్ చేయాలని క్రిష్ అండ్ టీమ్ భావిస్తున్నట్లు బోగట్టా. ఇక పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని సముద్రఖని సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారని టాక్. దాంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.