Hema: నటి హేమ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో, ట్యాలెంట్ తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి. ఆమె తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వెళ్లారు. దర్శనం చేసుకున్నాక మీడియాతో మాట్లాడుతుండగా ఊహించని పరిణామం ఎదురైంది. ప్రశాంతంగా గుడికి వెళ్లిన ఆమెను ఓ రిపోర్టర్ ప్రశ్న చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఇంతకీ ఆ రిపోర్టర్ ఏమడిగాడో తెలుసా..
గుడికి భక్తులంతా భక్తితో భగవంతుడి దర్శనం కోసం, ప్రశాంతత కోసం వెళ్తారు. దేవతామూర్తిని దర్శనం చేసుకుంటే మన శరీరంలో పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. అయితే ఇలాంటి పరిసరాల్లో మనసు చిరాకు తెప్పించే ఘటనలు చోటు చేసుకుంటే.. ఇక ప్రశాంతత ఎక్కడుంటుంది మరి. అలాంటి అనుభవమే నటి హేమకు ఎదురైంది.
దుర్గమ్మ దర్శనం చేసుకున్న హేమ మీడియాతో మాట్లాడుతూ, అమ్మ వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందంది. అమ్మవారిని దర్శించుకుంటానో లేదో అనుకున్నానని, దుర్గమ్మ తనను దగ్గరికి రప్పించుకుందని చెప్పింది. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ మీరు టికెట్ కొన్నారా? అని అడిగాడు. అంతే.. హేమ విశ్వరూపం చూపించింది.
Hema:
ఏంటి.. గుడిలో కూడా కాంట్రవర్సీ చేయాలని చూస్తున్నారా.. అంటూ హేమ ఆగ్రహించింది. అమ్మవారికి 20 వేలు పెట్టి చీర తెచ్చాను.. హుండీలో 10 వేలు వేశాను.. నేను ప్రోటోకాల్స్ అన్ని సక్రమంగా ఫాలో అవుతానంటూ సదరు రిపోర్టర్ పై మండిపడింది హేమ. అమ్మవారి దర్శనానికి వచ్చాను కానీ కాంట్రవర్సీ కోసం కాదని ఓ రేంజ్ లో విరుచుకుపడింది. దెబ్బకి రిపోర్టర్ ఖంగుతిన్నాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.