AP GOVT: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నవరత్నాల పేరిత ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఏ వర్గానికి చెందిన ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి చెందకూడదనే ఉద్దేశ్యంతో ఉంది. వరుసగా మరో రెండు, మూడు సార్లు వైసీపీ ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసే విధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే రైతులకు మెరుగైన సేవలు అందించాలని రైతుల భరోసా కేంద్రాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. రైతులకు సంబంధించిన సేవలను ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా అందిస్తోంది. రైతులకు ఎరువులు, విత్తనాలను సబ్సీడీతో పంపినీ చేస్తోంది. అదే విధంగా పొలంబడి పేరుతో రైతులకు పంటలు ఎలా దిగుబడి పెంచుకోవాలనే వాటిపై వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

దీంతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట నష్టపరిహారం, బీమాకు సంబంధించిన సేవలను కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే అందిస్తోంది జగన్ ప్రభుత్వం. వాతావరణం అనూకూలించకపోవడం కారణంగా ఏదైనా నష్టం కలిగితే రైతులకు నష్టపరిహారం రావాలంటే ముందుగా పంట బీమా నమోదు చేసుకోవాలి. దీంతో పాటు ఈకేవైసి కూడా తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది.
పంటల బీమా వంటి ప్రభుత్వ పథకాలకు అర్హత పొందడానికి రైతులంతా ఈ నెల 12 వ తేదీలోగా ఈకేవైసీ అంటే బయోమెట్రిక్‌లో వేలిముద్ర తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ రైతులకు సూచించారు. ఈకేవైసీ చేయించుకున్న రైతుల జాబితాను ఆర్బీకేల్లో ఈనెల 16 నుంచి సామాజిక తనిఖీలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ఈకేవైసి చేయించుకోవాలని తెలియజేశారు. రైతులు ఇందుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా గ్రామ పంచాయతీ పరిధిలో గల రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని ఆయన కోరడం జరిగింది.