Viral Kid Video: ప్రస్తుతం పిల్లలకు హోమ్ వర్క్ ఎక్కువ అవుతుంది, పిల్లల బ్యాగ్ బరువు పుస్తకాల తో బరువు పెరుగుతుందని నిపుణులు ఎప్పుడూ హెచ్చరిస్తూ వున్నారు. ఒకప్పుడు స్కూల్స్ వాతావరణం పిల్లలకు ఆహ్లాద కరమైన వాతావరణం లో వుండేవి. అలాగే ఇంటికి వెళ్ళిన తరువాత పుస్తకాల సంచి పడేసి ఆడుకోవానికి పిల్లలు వెళ్లి పోయే వారు. కాని ప్రస్తుతం ప్రతి స్కూల్ లో సెలవుల్లో కూడా హోం వర్క్ చేయడం కోసంముందే వర్క్ఇస్తున్నారు.
దీనివల్ల పిల్లలు ఎంతోఒత్తిడికి గురి అవుతున్నారు రు o ఒత్తిడిలో విచిత్రమైనమాటలు మాట్లాడుతూవుంటారు. ప్రస్తుతం వాళ్ల అమ్మ చదవమని చెప్పడంతో ఒక పిల్లాడు ఇచ్చిన రిప్లై వీడియో ప్రస్తుతం ఇంటెర్నెట్ లో హల్చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు వెరైటీ గా కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటి వరకు ఆ వీడియోను ఐదు లక్షల మంది కి పైగా చూసారు. 23వేల మంది విడియో కు లైక్ కొట్టారు. ఇంతగా హడావుడి చేసిన వీడియో లో మేటర్ ఏముంది అంటారా పదండి తెలుసుకుందాం.
ఒక తల్లి తన పిల్లలను కూర్చోబెట్టి.. హోం వర్క్ చేయమని చెపుతూ దగ్గరుండి పూర్తి చేయిస్తుంది. తర్వాత కొన్ని పాఠాలు చదవమని చెబుతుంది. దీనితో ఆ పిల్లాడి కి చికాకు ఎక్కువైపోయి నేను చదవను అని మొండికేస్తాడు. దీనితో చదవాల్సిందే అని ఒత్తిడి చేస్తుంది. దీనికి మనోడికి ప్రష్టేషన్ పెరిగి ఊహించని విధంగా సమాధానం ఇస్తాడు.
Viral Kid Video:
ఇలా ఎంత సేపు చదవాలి. ఇలా చదువుతూ పోతూ వుంటే నేను తొందరగా ముసలోన్ని అయి పోతా అని ఏడ్చుకుంటూ చెబుతాడు. ఈ పిల్లాడు చెప్పిన మాటలు ఎవరో వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలు గా కామెంట్స్ చేస్తున్నారు. మన దేశంలోలో అమ్మలు తగ్గేదిలే అంటున్నారు. కొంతమంది ప్రస్తుత విద్యా విధానం వల్ల పిల్లలు ఒత్తిడి కి గురి అవుతున్నారు అంటున్నారు. కొంత మంది ఆ తల్లి తాపత్రయ పడేది బుడ్డోడి కోసమే ’ అని కొందరు అంటున్నారు.
ज़िन्दगी भर पढ़ाई करते करते बुड्ढा हो जाऊंगा 🥲😅 pic.twitter.com/D3XNoifVSm
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 28, 2022