Vastu Tips: వాస్తుశాస్త్రం అనేది భారత దేశంలో పూర్వకాలం నుండి వచ్చిన అపూర్వమైన జ్ఞానం. మన దేశంలో ఇప్పటికీ ఎంతో మందికి దీని మీద నమ్మకం వుంది. ఎందుకంటే చాలా మంది ఇళ్లు కట్టిస్తూ ఇంజినీర్ ప్లాన్స్ వున్నా కూడా, వాస్తు సిద్ధాంతి సలహాలు సూచనలు కచ్చితంగా పాటిస్తారు. ఇది అంతగా చదువు లేని వారే కాదు, ఉన్నత చదువులు చదివిన వారు కూడా పాటిస్తున్నారు. ఎందుకంటే అన్ని వాస్తు ప్రకారం వుంటేనే వారికి మంచి జరుగుతుందని వారు నమ్ముతారు.
అలాగే మన ఇంట్లో, షాపుల్లో డబ్బులు, బంగారం ఎక్కడ వుంచితే లాభం జరుగుతుందో వాస్తు శాస్త్రం చెబుతోంది. కొంత మంది వీటిని సరైన స్థానంలో వుంచక పోవడంతో వారి సంపద కరిగిపోతుంది. ఈ రోజు డబ్బును, బంగారు నగలను వాస్తు ప్రకారం ఎక్కడ వుంచాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
వాస్తు శాస్త్ర ప్రకారం ఉత్తర దిక్కులో కుబేరుడు వుంటాడని శాస్త్రం చెబుతోంది. మీ ఇంట్లొ నగలు డబ్బు వుంచే బీరువాను ఉత్తర దిశలో ఉంచాలి. కానీ బీరువా తలుపు ఎప్పుడూ దక్షిణం వైపు ఉండకుండా చూసుకోవాలి ఇది మీ ఐశ్వర్యం విపరీతంగా పెరగటం కొసం ఉపయోగ పడుతుంది.మీకు ఉత్తరం లో స్థలం లేక పోతే తూర్పున వుంచండి మీకు లాభం కలుగుతుంది. అలాగే షాపుల్లో డబ్బును తీసుకొనే వారు తూర్పున కూర్చొని వుంటే డబ్బు పెట్టె కుడి పక్కన వుండేలా చూసుకోవాలి.
Vastu Tips:
ఇప్పుడు డబ్బులు ఎక్కడ పెట్టకూడదో తెలుసుకుందాం. ఎట్టిపరిస్థితుల్లోను డబ్బులను నైరుతి, ఈశాన్యం, ఆగ్నేయం వైపు అస్సలు వుంచొద్దు.దీని వల్ల ఖర్చులు పెరగడం, డబ్బు నష్టపోవడం జరుగుతుంది. అలాగే డబ్బులను, నగలను పూజ గదిలో ఉంచవద్దు.
కొన్నిసార్లు సార్లు పూజగది మీ బెడ్‌రూమ్ పక్కనే వుంటే బెడ్‌రూమ్‌లో లేదా మీ బట్టలు వుంచే దానిలో పెట్టుకోవాలి. మరెందుకు ఆలస్యం ఈ చిట్కాలన్ని పాటించి అంతులేని ఐశ్వర్యం సంపద పొంది, గొప్ప ధనవంతులుగా మారిపొండి.