Prabhas : అమ్మ.. మీమర్స్ అండ్ ట్రోలర్స్.. తగ్గేలా లేరుగా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్‌ల మధ్య ఏదో ఉందంటూ రచ్చ రచ్చ చేసేస్తున్నారుగా.. నిప్పు లేనిదే పొగ రాదు అనుకోండి. అయినా కూడా వీరి అబ్జర్వేషన్ చూస్తే.. వావ్ అనిపిస్తుంది. మొత్తానికి రెండు సీన్లను పట్టుకుని ప్రభాస్, కృతి సనన్‌ల మధ్య ఏదో ఉందంటూ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేసి మరీ పెద్ద ఎత్తున వాటిని వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మీమర్స్‌కి.. ట్రోలర్స్‌కి గిరాకీ బాగా పెరిగింది. వాళ్ల టాలెంట్‌నంతా వెలికి తీస్తున్నారు.
తాజాగా.. ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్, పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’కు సంబంధించిన టీజర్ లాంచ్ అయోధ్యలో జరిగిన విషయం తెలిసిందే. మోడ్రన్ రాముడిగా ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించబోతోన్నాడు. ఈ చిత్రంలో డార్లింగ్ సరసన సీతగా సూపర్ స్టార్ మహేష్ బాబు‘1 నేనొక్కడినే’ ఫేమ్ కృతిసనన్ నటిస్తోంది. అయితే ప్రభాస్‌కు, అమ్మడికి మధ్య ఏదో ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ కథనాలను ప్రచురించింది. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.
Prabhas : ఏదో కాలి నొప్పితో బాధపడుతుంటే..
ఇక ‘ఆదిపురుష్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అమ్మడు.. ప్రభాస్‌తో కళ్లు కళ్లు కలపడం.. కళ్లతోనే ఊసులాడటం.. చేయి చేయి కలపడం వంటివి చేసి అడ్డంగా దొరికి పోయింది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? ఆర్‌ఆర్ వేసి మరీ ఆడుకోవడం మొదలు పెట్టారు. ఏదో ఉంది అంటే నమ్మడం లేదు కదా.. ఇదిగో సాక్ష్యం అంటూ ట్విటర్ వేదికగా.. రచ్చ రచ్చ చేస్తున్నారు. మరోవైపు ఆయన అభిమానులేమో ‘మా ప్రభాస్ అన్న ఏదో కాలి నొప్పితో బాధపడుతుంటే కృతి సనన్ సపోర్ట్ ఇచ్చింది. దీనికే ఇంత రచ్చ చేస్తారా?’ అంటూ మండిపడుతున్నారు.