BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ భిన్నంగా జరిగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ సమయానుసారం ఇద్దరు సభ్యుల పేర్లు పిలిచినప్పుడు ఆ ఇద్దరు సభ్యులు వారి నుంచి ఏ ఒక్కరు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వాలో మరియు ఏ ఒక్కరు ఇంటి నుండి బయటికి వెళ్లాలో నామినేట్ అవ్వాలో నిర్ణయించుకుంటారు. బిగ్ బాస్ ఇద్దరి సభ్యుల పేర్లు పిలిచినప్పుడు కెప్టెన్ కీర్తి గార్డెన్ ఏరియాలో ఉన్న సంకెళ్లను వారి ఒక్కో చేతికి ధరింపచేసి తాళం వేస్తుంది.
ఇంటి సభ్యులు వారి నుంచి ఎవరు సేవ్ అవుతున్నారో.. ఎవరు నామినేట్ అవుతున్నారో నిర్ణయించుకున్న తర్వాత కెప్టెన్ కీర్తి సేవ్ అవుతున్న సభ్యులను సంకెళ్ల నుండి విడుదల చేస్తుంది. దీంతో ముందు మెరీనా, రోహిత్ ఇద్దరిని నామినేషన్స్ స్టార్ట్ చేయాలని చెప్తాడు. ఇద్దరిలో మెరీనా నామినేట్ అవుతుంది. రోహిత్ సేఫ్ అవుతాడు. తర్వాత బిగ్ బాస్ శ్రీహాన్, ఇనయలను సెలక్ట్ చేస్తాడు. వీరిద్దరూ కాసేపు వాదనల తర్వాత ఇనయ నామినేట్ అవుతుంది.

శ్రీహాన్ సేఫ్ అవుతాడు. సుదీప, వసంతిని బిగ్ బాస్ సెలక్ట్ చేస్తాడు. వీరిద్దరిలో వాదనల తర్వాత వాసంతి నామినేట్ అవుతుందిసుదీప సేవ్ అవుతుంది. ఇక బిగ్ బాస్ శ్రీసత్య, అర్జున్ ను పిలుస్తాడు. వీరిద్దరిలో డిస్కస్ చేసుకుని అర్జున్ నామినేట్ అవుతాడు. శ్రీసత్య సేఫ్ అవుతుంది. ఇక తర్వాత ఆదిరెడ్డి, రేవంత్ ఇద్దరూ వాదనలు చేసుకుంటారు. కాని ఆది రెడ్డి తానే స్వయంగా నామినేషన్ అవుతాడు. రేవంత్ సేవ్ అవుతాడు.
ఫైమా, సూర్య వాదనలు స్టార్ట్ చేస్తారు. వీరిద్దరిలో ఫైమా కాంప్రమైజ్ అవుతుంది. సూర్య సేఫ్ అవుతాడు.రాజ్, బాలాదిత్య ఇద్దరిలో బాలాదిత్య నామినేట్ అవుతున్నా అని అనౌన్స్ చేస్తాడు. రాజ్ సేవ్ అవుతాడు. ఇక గీతూ, చంటి వంతు వస్తుంది. చంటి తానే నామినేట్ అవుతాడు. గీతూ సేవ్ అవుతుంది. దీంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు మెరీనా, ఇనయ, వసంతి, అర్జున్, ఆదిరెడ్డి, ఫైమా, బాలాదిత్య, చంటి అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు.