టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టేసిన అందాల భామ కృతి శెట్టి. ఈ అమ్మడు తరువాత చేసిన రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో కెరియర్ లో వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. అయితే మొదటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఖాతాలోకి వచ్చి పడ్డాయి. అవి కూడా డిజాస్టర్ సినిమాలు కావడం విశేషం. దీంతో ఈ బ్యూటీపై అప్పుడే ఐరన్ లెగ్ ముద్ర వేసేయడానికి రెడీ అయిపోతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా మాత్రమే తెలుగులో ఉంది.
కొన్ని యంగ్ హీరోల చిత్రాలకి చర్చలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. కృతి శెట్టి ఫేమౌస్ ఆస్ట్రాలజర్ వేణు స్వామిని కలిసి అతని సమక్షంలో ప్రత్యేక పూజలు చేయడానికి రెడీ అవుతుందని టాక్. సెలబ్రెటీల జాతకాలు అంటూ సోషల్ మీడియాలో కొన్ని యుట్యూబ్ చానల్స్ ప్రమోషన్స్ తో వేణు స్వామి బాగానే పాపులర్ అయ్యాడు. చాలా మంది హీరోయిన్స్ వేణు స్వామితో దోషనివారణ పూజలు చేయించుకున్న హీరోయిన్స్ ఉన్నారు. వీరిలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన కూడా ఉండటం విశేషం.
ఈమెకి దోష నివారణ పూజలు చేసిన తర్వాత అదృష్టం కలిసొచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిందని వేణు స్వామి చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే కృతి శెట్టి అమ్మకి ఎవరో వేణు స్వామి గురించి చెప్పడంతో అతని దగ్గరకి కృతిని తీసుకొని వెళ్లాలని అనుకుంటుంది. అయితే దానికి ఆమె ఇన్ని రోజులు అంగీకరించలేదు అంట. అయితే వరుసగా మూడు ఫ్లాప్ లు పడేసరికి ఏదో ఒకటి దేవుడి మీదనే భారం వేద్దాం అనుకోని వేణుస్వామిని కలవడానికి ఒప్పుకుంది అనే మాట వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.