Krithi Shetty: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట మెగాహీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
మొదటి సినిమాతోనే ఉప్పెనలా దూసుకు వచ్చి తనఅందం అభినయంతో యూత్ ని కట్టి పడేసింది.
అలాగే మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను అందుకుంది. సినిమా మంచి విజయం సాధించడంతో అదే రేంజ్ లోనే సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోయింది.
కృతి శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉంది. ఇకపోతే ఇప్పటివరకు తెలుగులో ఈమె ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం కృతి శెట్టి చేతినిండా బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈమె సినీ ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే ఊహించిన విధంగా భారీ పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మను ఫాలో అయ్యే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.
ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూ అలాగే అవకాశాలు కూడా పెరగడంతో ఈ ముద్దుగుమ్మ కాస్త అందాల ఆరబోతలో డోస్ ని పెంచేసింది. మొదట్లో అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ వచ్చిన కృతి శెట్టి రాను రాను బట్టలు సైజులు తగ్గిస్తూ అందాల ఆరబోతతో యువతకు పిచ్చెక్కిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా కృతి శెట్టి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ ను ధరించి మత్తెక్కించే చూపులతో యువత దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ ఫోటోలలో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ ని ధరించి నడుముపై చేతులు పెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.