Health Tips మన ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో ఉసిరికాయకు ప్రత్యేక స్థానం ఇచ్చారు.ఇందులో ఉండే పోషక విలువలు మరియు ఔషధ గుణాల కారణంగా ఉసిరికాయను అమృత ఫలంగా పిలుస్తారు. ముఖ్యంగా ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండి మన నిత్య జీవితానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మన శరీర పెరుగుదలకు అవసరమైన ఫైబర్, క్యాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి.
ఉసిరికాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ గుణాలు సీజనల్గా వచ్చే వ్యాధులను ఎదుర్కొనడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ఉసిరికాయను పచ్చడి రూపంలోనే కాకుండా ఉసిరి పొడి, జ్యూస్, జాం, జెల్లీ వంటి రూపాల్లో తయారు చేసుకొని నిత్యం ఆహారంలో ఉపయోగిస్తాం. అయితే ఉసిరికాయను ఎండబెట్టి పొడి రూపంలో తయారు చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసుడు మంచినీళ్లలో కలుపుకొని సేవిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ఉసిరికాయలో విటమిన్ ఏ, సి, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. కావున ప్రతిరోజు ఉదయాన్నే ఉసరి పొడిని గ్లాసుడు మంచినీళ్లు కలుపుకొని సేవిస్తే విటమిన్ ఏ కంటిచూపులు మెరుగుపరుస్తుంది. విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో పాటు శరీరంలోని అన్ని అవయవాలను సమన్వయ పరుస్తుంది. కాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది.
జీర్ణ సంబంధిత వ్యాధులైన మలబద్ధకం, గ్యాస్టిక్, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే ఉసరీ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Health Tips
ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీరాడికల్స్
గుణాలు చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.
ఉసరి పానీయాన్ని ప్రతిరోజు సేవించడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రిస్తుంది. దాంతో డయాబెటిస్ వ్యాధికి దూరంగా ఉండవచ్చు.