Health Tips: సహజంగానే వాతావరణంలో కలిగే మార్పులు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వర్షాకాలం వచ్చిందంటే వ్యాధుల కాలం వచ్చినట్లే. ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలల్లో అధిక వర్షాలు,తడి వాతావరణం కారణంగా మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకర వైరస్, బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. దాంతో చిన్నపిల్లలు, వృద్ధులు మరియు రోగ నిరోధక శక్తి తక్కువగా కలిగిన వారు తరచూ జలుబు, దగ్గు, జ్వరం, వివిధ రకాల చర్మ సమస్యలు వంటి అనేక రకాల అనారోగ్య కారణాలతో బాధపడాల్సి వస్తుంది.
కొన్ని ఆరోగ్య సంస్థల అధ్యయనం ప్రకారం వర్షాకాల సీజన్లో రెనో వైరస్ వంటి రెండు వందల రకాల వైరస్లు అధికంగా వాతావరణంలో అభివృద్ధి చెంది అనేకరకాల అలర్జీలకు కారణమవుతాయని అంచనా. దీని కారణంగానే చిన్నపిల్లలు మరియు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా కలిగిన వారు వర్షాకాలం మరియు శీతాకాలంలో అనేక రకాల అలర్జీలతో ఎక్కువసార్లు బాధపడాల్సి వస్తోందని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి.
వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ, అలర్జీలు సాధారణమైనప్పటికీ తొలిదశలో వీటిపై శ్రద్ధ వహించకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రమాదకర రెనో వైరస్, కరోనా వైరస్ వంటివి సీజనల్ వ్యాధులకు కారణం. ఈ వైరస్లు బయట వాతావరణం లో ఎక్కువసేపు జీవించి ఉండి మన చేతుల ద్వారా శరీరంలో ప్రవేశించి వ్యాధులను కలగజేస్తాయి.కావున ఈ వైరస్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే తరచూ చేతులను శుభ్రం చేసుకోవడంతో పాటు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
Health Tips: వ్యాధి నిరోధక శక్తి ఎంతో అవసరం..
సీజనల్గా వచ్చే అలర్జీలను ఎదుర్కోవడానికి మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా కలిగిన పండ్లు, కూరగాయలను నిత్యం ఆహారంగా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల మానసికంగాను, శారీరకంగానూ దృఢంగా ఉండవచ్చు.