Viral Fight Video: అమ్మాయిలు సున్నితమనస్కులని, సౌమ్యంగా ఉంటారని అంటారు. కావ్యాలు, ప్రబంధాల్లో ఆడవారిని పూలతీగలతో పోల్చారు. కానీ, అమ్మాయిలు తాము మగవారి కన్నా ఏమా తక్కువ కాదని చాలా సార్లు నిరూపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాత్రంలో చక్కర్లు కొడుతున్న వీడియో తో అమ్మాయిలు తాము మల్లయోధులకు ఏమాత్రం తీసి పొమ్మని చెప్పకనే చెప్పారు. వీడియోలో యువతులు ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఇద్దరు యువతులు ఘోరంగా దెబ్బలాడుకున్నారు. తాము రోడ్డు మధ్యలో ఉన్నామన్న స్పర్శ కూడా లేకుండా, ఆ యువతులు గొడవ పడ్డారు. అటుగా వెళుతున్న వారు వీడియో తీసి నెట్టింట షేర్ చేశారు. పుస్తకాల్లో మనం చదివే పోరాటాలకు ఏ మాత్రం తీసిపోకుండా, ఆ యువతులు ఒకరితో ఒకరు తలపడ్డారు. ఈ వీడియో వైరల్ గా మారినా, ఈ సంఘటన గురించిన వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. వీడియోలో ఉన్నది ఎవరు? వారి మధ్య గొడవకు గల కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకుండా, యువతులు పిడి గుద్దుల వర్షం కురిపించారు.
ఈ యువతుల మధ్య గోడవ అటుగా వెళుతున్న వారి దృష్టిని ఆకర్షించింది. చేతిలో ఉన్న ఫోన్లని తీసి వాటికి పని చెప్పారు. వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తి, రాక్ మ్యూజిక్ ని దానికి జోడించాడు. వీడియోలో ఉన్న ఎమోషన్ కి కనెక్ట్ అయ్యేలా మ్యూజిక్ ని జోడించారు. అందరూ వారి మధ్య తతంగాన్ని ఫోన్లలో చిత్రీకరించారు తప్ప, వారిని ఆపాలని అక్కడఎవరికీ తోచలేదు.
Viral Fight Video:
అసలే బాహాబాహీ దెబ్బలాడుతున్నారు, మనకెందుకులే. మధ్యలో వెళితే మనం కూడా దెబ్బలు రుచి చూడాల్సి వస్తుందని అనుకున్నారు కాబోలు. తీరిగ్గా వేడుక చూశారు గానీ, యువతుల దగ్గరికి వెళ్ళే సాహసం మాత్రం చేయలేదు.వీడియోని చూసి, ఇది జరిగింది మాత్రం ఇండియాలో కాదు. ఏదైనా పాశ్చాత్య దేశంలో ఉండవచ్చు అని కొంతమంది నెటిజన్లు అభిప్రాయ పడ్డారు.
Fists of fury 🤣 pic.twitter.com/4hREYWowF7
— Vicious Videos (@ViciousVideos) September 29, 2022