Relationship Tips: స్త్రీ, పురుషుల కలయిక ప్రకృతి ధర్మం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ శృంగారం ఒక భాగం. వయసుకొచ్చిన స్త్రీ, పురుషులందరిలోనూ తొలి కలయిక పై చాలా ఆశలతోపాటు అనుమానాలూ ఉంటాయి. అయితే శృంగారం సర్వసాధారణ విషయంగా భావిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. తొలిసారి రొమాన్స్ చేసేవాళ్ళు తెలుసుకోవలసిన విషయాలేంటో చూద్దాం.
ప్రతిక్షణం ఆస్వాదించాలి.
తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడూ అందరికీ ఒకే విధమైన అనుభవం కలగకపోవచ్చు. కొందరు సక్సెస్ అవొచ్చు. మరికొందరు అవకపోవచ్చు. తొలిసారి శృంగారంలో పాల్గొంటున్నాం అంటే.. బాగా ప్రిపేర్ అవ్వాలని అందరూ అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా ప్రిపేరయ్యి చేయాల్సింది ఏం ఉండదనే విషయం తెలుసుకోవాలి. ప్రతిక్షణాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. అప్పుడే రొమాన్స్ లోని పూర్తి ఆనందాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది.
కాసేపు మనసు విప్పి మాట్లాడుకోండి..
ఇద్దరికీ తొలి కలయిక అయితే కాస్త భయం ఉండే అవకాశం ఎక్కువ. అయితే దాన్నుంచి భయటపడాలంటే ఇద్దరూ శృంగారం గురించి కాసేపు చర్చించుకోవాలి. తమతమ మనసుల్లో కలయికపై ఉన్న అనుమానాలు, అపోహలతోపాటు ఇష్టం, ఆశల గురించి పంచుకోవాలి. నేరుగా శృంగారం మొదలు పెట్టకుండా ముద్దులు, కౌగిలింతలతో ఫోర్ప్లే చేసి భాగస్వామిని ఉత్తేజపరచాలి. ముఖ్యంగా మగవారిలో వచ్చినంత త్వరగా ఆడవారికి మూడ్ రాదు. ఏదేమైనా కొన్నిసార్లు మొదటిసారి భావప్రాప్తి కలగకపోవచ్చు. అంతమాత్రాన ఫెయిలయ్యామని నిరాశపడకూడదు. అంతసేపు తాము అనుభవించిన ఆనందపు క్షణాలను మరిచిపోకూడదు. మరోసారి కలిసే సమయం కోసం ఎదురుచూడాలి.
Relationship Tips: అపోహలు నమ్మవద్దు..
శృంగారం ఎంతసేపు చేయాలనేది దాంట్లో పాల్గొనేవారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది మగాళ్లకు, ఆడవారికి శృంగారంలో పాల్గొనే సమయంలో సుఖం దక్కదనే అనుమానం ఉంటుంది. అందుకే దానికి దూరంగా ఉంటారు. అయితే తొలిసారి కలయికలో పాల్గొనేటప్పుడు పుల్లింగ్ అవుట్ పద్ధతిని పాటించి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు కండోమ్ వాడుతూ ఉంటారు. అయితే సురక్షితమైన శృంగారం కోరుకునే వారు కండోమ్‌ను కచ్చితంగా వాడాలి. అనుమానం ఉంటే కలయిక ముందే ఇద్దరూ ఏమైనా డిసీజెస్ టెస్టు చేయించుకోవడం మంచిది. శృంగారంలో పాల్గొనే చాలామంది వ్యక్తులు కామసూత్రలోని కొన్ని భంగిమలను ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మొదటిసారే అలాంటి ప్రయోగాలు చేయకుండా ఇద్దరికీ వీలుగా, సౌకర్యంగా, తక్కువ నొప్పిని కలిగించే భంగిమలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం మిషనరీ పొజిషన్(స్త్రీలపై పురుషులు ఉండే పొజిషన్) అయితే సౌకర్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరింకెందుకు ఆలస్యం… మీరూ మీ తొలికలయికలో స్వర్గపు అంచులను తాకేలా ప్లాన్ చేసుకోండి.