ఆదిపురుష్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో టి సిరీస్ ఈ సినిమాని నిర్మించగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన విజువల్ వర్క్ అవుతుంది. ఇక ఈ మూవీ టీజర్ తాజాగా అయోధ్యలో లాంచ్ అయ్యింది. ఈ టీజర్ ఓ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించగా మరో యాంగిల్ లో విమర్శలకి గురవుతుంది. గ్రాఫిక్స్ పెజెన్స్ విషయంలో ఓం రౌత్ ఇంకా వర్క్ చేయాలని చాలా మంది సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ ని చిత్ర యూనిట్ ఇప్పటికే షురూ చేసింది. దానికి తగ్గట్లే బజ్ క్రియేట్ చేస్తుంది. హిందూ మైథలాజికల్ కాన్సెప్ట్స్, హిందుత్వ భావజాలాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఆదిపురుష్ టీజర్ నచ్చుతుంది. ఈ నేపధ్యంలో దానికి తగ్గట్లే ఓం రౌత్ అండ్ టీమ్ హిందూ ఈవెంట్స్ లో ఈ ఆదిపురుష్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీరాముడి జన్ స్థలం అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల చేసి ట్రెండ్ సృష్టించిన ఓం రౌత్ ఇప్పుడు దీపావళి సందర్భంగా ఇండియాలో ఢిల్లీ రామ్ లీల మైదానంలో రాక్షస దహనం జరుగుతుంది.
ఈ ఈవెంట్ లో ప్రభాస్ పాల్గొనడమే కాకుండా ఆయన చేతుల మీదుగా ఈ రావణ దహనం కార్యక్రమం జరగబోతుంది. మొదటి సారి ఇక తెలుగు హీరో నార్త్ ఇండియాలో అతిపెద్ద రావణ దహనం కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉండటం నిజంగా అందరికి సంతోషాన్ని ఇచ్చే విషయం అని చెప్పాలి. ఇక ప్రధాన ఫెస్టివల్ ని టార్గెట్ గా చేసుకొని ఆదిపురుష్ సినిమాని ప్రజలు మైండ్ లోకి బలంగా ఎక్కించే ప్రయత్నం ఓం రౌత్ మొదలు పెట్టారు. ఇక ఈ సినిమా టీజర్ పై వస్తున్న విమర్శలపై ఓం రౌత్ ఏ విధంగా సమాధానం చెబుతారు అనే విషయంలో కూడా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.